టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, టాలీవుడ్ బడా స్టార్లైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, దానయ్య నిర్మాతగా దాదాపుగా రూ.425 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. 

ఇక రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా ఎంపిక కాగా, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఇటీవల ఒక బ్రిటిష్ నటి ఎంపికైనట్లు సమాచారం. ఇకపోతే తెలుగుతో పాటు, మనదేశంలోని పలు ఇతర భాషల్లో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి, కొద్దిరోజులుగా ఒక ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తుండడంతో, చివరికి నేడు దానిపై ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ స్పందించింది. కొన్నాళ్లుగా తమ ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కాస్టింగ్ కాల్స్ జరుగుతున్నాయంటూ, దర్శకులు రాజమౌళి గారి పేరుతో ఉన్న ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి పలు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, 

అయితే అవన్నీ కూడా ఫేక్ ప్రొఫైల్స్ అని, అలానే అటువంటి కాస్టింగ్ కాల్స్ తమ సినిమాలో ప్రస్తుతం జరగడం లేదని, ఒకవేళ రాబోయేరోజుల్లో అటువంటిది ఏమైనా ఉంటె, తమ సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియపరచడం జరుగుతుందని, కాబట్టి అటువంటివి నమ్మి ప్రజలెవరూ కూడా మోసపోవద్దని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హెచ్చరిస్తూ, కాసేపటిక్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సినిమాలోని ప్రధాన తారాగణంతో కలిసి బల్గెరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను, వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: