టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా తండ్రి తరహాలో ఎన్నో రకాల పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  తండ్రి తరహాలో సాంఘిక,పౌరాణిక,జానపద సినిమాల్లో నటించిన ఆయన ఫ్యాక్షన్ సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.  కొన్ని సినిమాలైతే కేవలం బాలయ్య కోసమే తీశారా అన్న చందంగా ఉండేవి. 

క్రిష్ దర్శకత్వంలో తన వందవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక సినిమాతో అలరించిన ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ లాంటి మాస్ క్యారెక్టర్ లో నటించారు.  ఇక తన తండ్రి జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ లాంటి బయోపిక్ లో నటించారు. కానీ ఆ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.  అదే సమయంలో ఏపిలో ఎన్నికలు రావడంతో పూర్తిగా ప్రచారానికి పరిమితం అయ్యారు.  హిందూ పూర్ నుంచి ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందారు.  చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు.   కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

రవికుమార్, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన జైసింహా మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయింది. మరోసారి బాలయ్య రవికుమార్ కు అవకాశం ఇచ్చారు.  ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చూసి అందరూ స్టన్ అయ్యారు. పూర్తి యంగ్ లుక్ లో చైనీస్ గెడ్డంతో చాలా అందంగా కనిపించాడు బాలకృష్ణ. కొత్తగా కనిపిస్తున్న ఫ్రెంచ్ కట్ బియర్డ్, సరికొత్త బాడీ లాగ్వేజ్ తో బాలయ్య పూర్తిగా మారిపోయాడు.

మునుపెన్నడూ చూడని బాలయ్యని రవికుమార్ ఈ చిత్రంలో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో  వినాయకచవితి సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్స్ లో బాలయ్య స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. మరో పోస్టర్ లో బాలయ్య రొమాంటిక్ యాంగిల్ కనిపిస్తోంది. ఈ మూవీలో  వేదిక మరో హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. సి కళ్యాణ్ ఈ మూవీకి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: