సూర్య  నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో 'బందోబస్త్'గా   సెప్టెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా జెఆర్సీ కన్వెక్షన్ హాల్ లో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్  జరగొచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ చీప్ గెస్ట్ గా  వస్తారట. గతంలో విజయ్ దేవరకొండ 'నోటా' సినిమాకి తమిళంలో సూర్య బాగానే ప్రమోట్ చేశాడు. ఇక అప్పటినుంచీ విజయ్, సూర్యతో మంచి రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే  'బందోబస్త్'కి పిలవకముందే తానూ ఫంక్షన్ కి వస్తానని విజయ్ 'బందోబస్త్' మేకర్స్ తో అన్నాడట.  ఈ సినిమాలో సూర్య  కమాండోగా, రైతుగా ఇలా రెండు గెటప్పుల్లో కనిపించనున్నాడు.  ప్రతి సినిమాలో  కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని  ప్రతి సినిమాకు స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటాడు  సూర్య.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం',   'గజినీ', 'సెవెన్త్ సెన్స్', '24' 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ సినిమాలు  ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సూర్య గెటప్స్ కూడా కొత్తగా ఉండటంతో  ప్రేక్షకుల్లో సినిమా పై క్యూరియాసిటీని పెంచాయి. 


ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దేశభక్తి గీతం 'ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్, ట్రయిలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అందుకే ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన 'జెమినీ' సొంతం చేసుకుంది. లైకా మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ భారీ స్థాయి విడుదల చేయనున్నారు.  హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లకు మంచి స్పందన వస్తోంది.  ఈ సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.  మరి ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. సినిమా ప్రోమోస్ కు వస్తోన్న స్పందన చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది. మరి సూర్య ఈ సారి  హిట్ కొడతాడేమో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: