ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు.  ప్రస్తుతం విదేశాల్లో కొమరం భీం కు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరణ చేస్తున్నారు.  మరో నెలకు పైగా షూటింగ్ అక్కడే జరిగే అవకాశం ఉన్నది.  భారీ సినిమా కాబట్టి వినాయక చవితి రోజున ఈ సినిమాకు సంబంధించి ఏదైనా లుక్ ను రిలీజ్ చేయబోతున్నారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  


ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను భారీగా తీస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పై చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.  ఇప్పటికే అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి.  వారిలో ఎవరిని సెట్ చేస్తున్నారో అర్ధంకాని విషయాన్ని. రాజమౌళి ప్రతిదీ కథ ప్రకారం నడుచుకుంటారు కాబట్టి హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ కారన్నది సత్యం.  


ఇప్పటికే ఇద్దరినీ చూసినా.. ఇద్దరు సినిమా నుంచి వివిధ కారణాల వలన తప్పుకున్నారు.  ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే కథ ప్రకారం విదేశీ అమ్మాయి కావాలి.  అప్పటి వరకు వెతుకుతూనే ఉంటారు.  అటు అల్లూరి సీతారామ రాజు రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ చేస్తున్నది.  గతంలో షూటింగ్ పాల్గొనాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన పాల్గొనలేకపోయింది.  ఫారెన్ షెడ్యూల్ తరువాత ఇండియాలో జరిగే షెడ్యూల్ లో అలియా భట్ పాల్గొన వచ్చు.  


వినాయక చవితితోనే తెలుగు పండుగలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ పండుగ రోజున ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఏదైనా స్పెషల్ లుక్ ను రిలీజ్ చేస్తారని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.  స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ఎలాంటి లుక్ రిలీజ్ చేయలేదు.  రేపైనా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలని అందరు ఎదురు చూస్తున్నారు.  మరి రాజమౌళి ఆలోచన ఎలా ఉందొ చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: