నందితా దాస్ సినిమాలన్నీ అవార్డు సినిమాలే ఆమె ఏ సినిమాలో చేసినా కూడా అందులో ఎంతో బలమైన కథ కథనం ఉంటాయి ఆమెతోపాటు నటించే ఇతర నటీనటులు కూడా నటన పరంగా ఎన్నో అవార్డులను అందుకున్న స్థాయిలోనే ఉంటారు. ఆమె ఇంతకు ముందు తెలుగు సినిమా లో పని చేసినా కూడా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి ఎక్కువగా పరిమితమయ్యారు ఇతర భాషలు చేసినప్పటికి తెలుగు కు దూరంగా ఉన్నారు అది కథలు సరిగా రాకపోవడం మరియు టాలీవుడ్లో కథాపరమైన చిత్రాలు సినిమాలకు ఆదరణ లేక పోవడమే కారణాలు.

తెలుగులో నటించిన తర్వాత దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడే నందితా దాస్ కి తెలుగులో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు ఇందులో నటిస్తున్నందుకు ఆనందంతో పాటు ఎంతో బెరుకు భయం బిడియం కూడా ఉన్నాయి అని వెల్లడించారు.

నటనకు మరో పేరుగా నందితాదాస్ ను అభినందిస్తారు అటువంటి ఆమె రా నా పక్కన పని చేయడంలో కాస్త వేరుగా ఉంది అనడంపై అందరూ ఆమె హుందాతనానికి జోహార్లు పలికారు. ఆమె మళ్లీ తెలుగు పరిశ్రమ కు తిరిగి వస్తున్నందుకు తమకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

డైరెక్టర్గా బాధ్యతలు లేకుండా హాయిగా నటించడం లో ఉన్న ఆనందం ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు దక్కింది అని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాయి పల్లవి అద్భుతమైన నటి అని ఆమెతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. రానా తో పాటు సెకండ్ షెడ్యూల్ లో పని చేయబోతున్నట్టు తెలిపారు. 1990లలో మావోయిస్టుల కథనాలు చుట్టూ ఈ సినిమా ఉండబోతున్న టు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: