యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ‘సాహెు’నటించారు.   ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు.  తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ బాషల్లో రిలీజ్ చేశారు.  బాలీవుడ్ లో ప్రభాస్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేస్తూ వచ్చారు.  ఇక మూవీ రెండు రోజులు రిలీజ్ కి ముందు అన్నితెలుగు ఛానల్స్ లో చిత్ర విశేషాలు పంచుకున్నారు.  అయితే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కాకపోతే మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇక సినిమా భారీ నష్టాలు తెచ్చిపెడుతుందని భావించారు.  కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రెండు రోజులకు రెండు వందల కోట్లు వసూళ్లు చేసింది. 


ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవులు ఈ మూవీకి బాగానే కలిసి వస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా తాను నటించిన 'సాహో' ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆయన, ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనపై ఎన్నో ప్రేమకథలు వచ్చాయని, వాటిపై తాను ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పందించానని, అయినా వార్తలు ఆగడం లేదని అన్నాడు. తనకు ఇంత మంచి స్థానం ఇచ్చిన సినీ ప్రేక్షకులకు తన గురించి ప్రతి విషయాన్ని ఓపెన్ గా చెబుతానని..తాను ఎవరినైనా ప్రేమించినా, తన వివాహం నిశ్చయమైన, అభిమానులకు వెంటనే చెబుతానని, ఈ విషయంలో దాచి పెట్టేది ఏమీ లేదని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యాఖ్యానించాడు.   


తన ఫ్యాన్స్ కు ఎంతో ఓపికని, రెండేళ్ల పాటు సినిమా రాకున్నా ప్రేమతో ఎదురు చూసి డైహార్డ్ ఫాన్స్ అయిపోయారని అన్నారు. వారి ప్రేమను చూస్తుంటే, ఓ వైపు గర్వంగాను, మరోవైపు భయంగానూ అనిపిస్తుంటుందని, వారి నమ్మకాన్ని, ప్రేమను నిలుపుకునేందుకు మరింత జాగ్రత్తగా ఉంటానని అన్నారు.  గతంలో ప్రభాస్, అనుష్క మద్య ఎఫైర్ నడుస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. దానిపై ఈ మద్య ప్రభాస్ స్పందించి..తాను అనుష్కను ప్రేమిస్తే..పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంత సమయం పట్టేది కాదని..తమ నిర్ణయాలు పెద్దలకు చెప్పి ఎప్పుడో పెళ్లి చేసుకునేవాళ్లమని.. అనుష్క తనకు మంచి స్నేహితురాలే అని క్లారిటీ ఇచ్చాడు. తాను లవ్ చేస్తే, ఆ విషయాన్ని కచ్చితంగా అందరితో చెబుతానని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: