విక్టరీ వెంకటేష్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఒక సందర్భంలో వెంకటేష్ తన కుటుంబ సభ్యులు అందర్నీ వదిలి హిమాలయాలకు వెళ్ళిపోవాలని అనుకున్నట్లుగా స్వయంగా వెంకటేష్ చెప్పాడు. ఇక పవన్ వెంకటేష్ లు కలిస్తే వారిద్దరి మధ్య జరిగే వేదాంత చర్చలు చాల ఆసక్తిదాయకంగా ఉంటాయని ఇండస్ట్రీలోని వీరిద్దరి సన్నిహితులు చెపుతూ ఉంటారు. 

ఇలాంటి పరిస్థితులలో వెంకటేష్ ఈమధ్య సూర్యాస్తమయానికి సంబంధించి ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫోటో పై కొన్ని షాకింగ్ కామెంట్స్ పెట్టాడు. ‘ఒక సాయంత్రాన్ని ఇంత అందంగా గడపడం అంటే నాకు చాలా చాలా ఇష్టం’ అంటూ వేకటేష్ తన ఇంటి మేడ మీద బాల్కనీలో కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆశ్వాదిస్తున్న ఫోటోను షేర్ చేయడం వెంకీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ మూవీలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా దసరా రేసుకు రావలసి ఉన్నా అదే సీజన్ ను టార్గెట్ చేసి విడుదల కాబోతున్న ‘సైరా’ తో పోటీ ఇష్టంలేక ఈమూవీని దీపావళి తరువాత విడుదల చేయబోతున్నట్లు టాక్. ‘ఎఫ్ 2’ మ్యానియాతో ‘వెంకీమామ’ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. 

దీనితో ఎటువంటి పోటీ లేకుండా సింగిల్ గా వచ్చి ఈ మూవీని కూడ హిట్ కొట్టాలని వెంకీ చాల ఆశ పడుతున్నాడు. స్వామీ వివేకానంద జీవితం పై ఎవరైనా బయోపిక్ తీస్తే ఆ మూవీలో టైటిల్ పాత్ర చేయాలని వెంకటేష్ ఆరాటపడుతున్నా ఏ ప్రముఖ దర్శక నిర్మాతలు అందుకు సాహసించడం లేదు. దీనితో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ చేయకుండానే తాను ఇండస్ట్రీ నుండి రిటైర్ అయిపోతానా అన్న భావోద్వేగంతో ఇలా సూర్యాహస్తమయాన్ని చూస్తూ కూర్చున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: