ఇటీవల భారీ అంచనాల మధ్య ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా విడుదలైంది. ఈ సినిమాను ఇటీవల తాజాగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూడటం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సాహో సినిమా పై స్పందించారు కేటీఆర్. సినిమా చాలా అద్భుతంగా ఉందని సాహో కి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఎవరు సినిమా కూడా అదే రోజు కేటీఆర్ చూడటం జరిగింది. చూసిన రెండు సినిమాలు మంచి సినిమాలే అని...సాహో టెక్నిక‌ల్‌గా బ్రిలియంట్ అని.. ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచేలా ఇది తెర‌కెక్కింద‌ని అన్న కేటీఆర్.. ఈ చిత్ర హీరో ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు సుజీత్‌ల‌కు అభినంద‌న‌లు తెలిపాడు.


ఇక ఎవ‌రు సినిమా గురించి కేటీఆర్ స్పందిస్తూ.. దీని స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంద‌ని.. అడివి శేష్‌, రెజీనా క‌సాండ్రా, న‌వీన్ చంద్ర అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చార‌ని అన్నారు కేటీఆర్. ఎవరు సినిమా ఎలాగో మంచి హిట్టే, అయితే  నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సాహో గురించి కేటీఆర్ ఇంత పాజిటివ్‌గా ట్వీట్ చేయ‌డం కాస్త ఆశ్చ‌ర్య‌మే అంటోంది మీడియా. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో సిల్వర్ స్క్రీన్ లపై రిలీజ్ అవ్వడం జరిగింది.


ఈ సందర్భంగా మొట్ట మొదటి రోజు 'సాహో' సినిమా 100 కోట్ల కలెక్షన్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'సాహో' సినిమా కి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్లు మాత్రం ఆధారపడుతున్నాయి. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా...మొట్ట మొదటి రోజు డివైడ్ టాక్ రావడంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. అయితే పండుగ సీజన్ నేపథ్యంలో సినిమాకి మంచి ఆదరణ వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: