పవన్ కళ్యాణ్ 2018 లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తరువాత మరలా సినిమా చేయలేదు.  పవన్ రాజకీయాల్లో బిజీఅయ్యారు.  రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన పవన్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కూడా రాజకీయాల్లోనే ఉంటానని, తన చివరి ఊపిరి వరకు రాజకీయాలకే అంకితం అవుతానని అన్నారు.  రాజకీయాల్లో ఉండటం ఉండటం మంచిదే.. కాకపోతే ఆ రాజకీయాల్లో ఎంతవరకు రాణిస్తారో పవన్ ముందుగా తెలుసుకోవాలి.  

రాజకీయాలంటే మామూలు విషయం కాదు.  ఈ విషయం పవన్ కు ఇప్పటికే అర్ధం అయ్యి ఉండాలి.  పవన్ రాజకీయాల్లో ఉండటం మంచి విషయమే కాకపొతే.. రాజకీయాల్లో కంటే పవన్ సినిమా రంగంలో ఉంటె ఇంకా బాగుటుంది.  సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ రాణిస్తారు అనడంలో సందేహం లేదు.  ఎలాగో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నది.  


కాబట్టి ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే, అప్పుడప్పుడు సినిమా రంగాన్ని కూడా పలకరిస్తే బాగుంటుంది.  రాజకీయాల్లో రాణించాలి అంటే డబ్బు కావాలి.  డబ్బు లేకుంటే ఒక్క పని కూడా ముందుకు జరగదు.  పవన్ ఒక్క సినిమా చేస్తే.. ఓ నాలుగైదు నెలలపాటు రాజకీయాలు నడపొచ్చు.  కాబట్టి వీలు దొరికినపుడు సినిమాలు చేయడం మంచిది.  అప్పట్లో ఎన్టీఆర్ రెండు రంగాల్లో రాణించారు.  


చాలా మంది నటులు ఇలానే చేశారు.  ఎన్నికల్లో విజయం సాధించి బిజీ అయినపుడు సినిమాలను పక్కన పెట్టొచ్చు. పవన్ ఈ ఐదేళ్ళలో కనీసం రెండు మూడు సినిమాలైనా చేస్తే బాగుంటుంది.  మరి పవన్ మదిలో ఆలోచన ఎలా ఉన్నదో చూడాలి. పవన్ సినిమా చేస్తే అభిమానుల్లో తిరిగి సందడి మొదలైనట్టే.  సైరాకు వాయిస్ ఇచ్చారు. అలానే ఓ సినిమా కూడా చేస్తే బాగుంటుంది కదా.. అభిమానుల కోరికను తీర్చిడం నటుడిగా పవన్ పని కదా.  పవన్ ఏమంటారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: