జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నేడే అసలైన పండుగ అని చెప్పవచ్చు. తమ అభిమాన నాయకుడు, పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ 48 పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇదే రోజు వినాయక చవితి పండుగ కూడా ఉండటంతో వారి ఆనందం మరింతగా  రెట్టింపు అయ్యింది.

దీనితో  ఒకవైపు గణపతి పప్పా మోరియా అంటూనే.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో  శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు . ఇక అభిమానులతో సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 

పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలోని డిఫరెంట్ లుక్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసి పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. ఇక భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలని  తెలియజేస్తూ మరో పోస్టర్ విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లతో భయానకంగా కనిపించిన వరుణ్ సందేశ్.. ఈ లుక్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించారు. ఈ చిత్రంలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నుంచి సినీ రచయితగా మారిన వ్యక్తి పాత్రలో న‌టిస్తుండ‌గా.. ఆ లుక్‌ను రివీల్ చేశారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం తమిళ ‘జిగర్తాండ’కు రీమేక్. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇలా పవన్ పై తనకున్న ప్రేమని చాటుకున్నాడు హీరో వరుణ్ తేజ్ 


మరింత సమాచారం తెలుసుకోండి: