గతేడాది ఆగస్ట్ లో అన్నీ సర్ ప్రైజ్ హిట్స్ వచ్చిపడ్డాయి. ఊహించని విధంగా గూఢచారి ఘనవిజయం సాధిస్తే.. గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. ఇక అంతకంటే ఆశ్చర్యకరంగా చిలసౌ సినిమా హిట్ అయింది. ఇలాంటి మేజిక్ ఈ ఏడాది ఆగస్ట్ లో మిస్ అయింది. సర్ ప్రైజ్ హిట్స్ మాట అటుంచితే, అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి.


ఈ ఏడాది మొదటి వారంలో గుణ369, రాక్షసుడు, శివరంజని సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో గుణ, రాక్షసుడు సినిమాలపై ఓ మోస్తరు అంచనాలుండేవి. ఆ అంచనాల్ని రాక్షసుడు నిలబెట్టుకున్నాడు కానీ గుణ అందుకోలేకపోయాడు. కార్తికేయ నటించిన గుణ సినిమా ఆడలేదు. అటు ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ మాత్రం రాక్షసుడుతో ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు. జబర్దస్త్ రష్మి నటించిన శివరంజని సినిమా ఇలావచ్చి అలా వెళ్లింది.


రెండోవారంలో మన్మథుడు2, కథనం, అయోగ్య, కురుక్షేత్రం, కొబ్బరిమట్ట సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో భారీ అంచనాల మధ్య వచ్చిన మన్మథుడు2 సినిమా డిజాస్టర్ అయింది. నాగ్-రకుల్ జంటగా నటించిన ఈ సినిమాను చాలామంది అసహ్యించుకున్నారంటే సినిమా రిజల్ట్ ఏం రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమాను అతి తక్కువ రేట్లకు అమ్మినప్పటికీ కనీస లాభాలు కూడా తెచ్చుకోలేకపోయింది. ఉన్నంతలో వచ్చిన డబ్బులు ప్రచారానికే సరిపోయాయి. ఇక అనసూయ నటించిన కథనం సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా.. మిగతా సినిమాలపై చర్చ కూడా అనవసరం.

 

మూడో వారంలో రణరంగం, ఎవరు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. పంద్రాగస్ట్ కానుకగా వచ్చిన ఈ 2 సినిమాలపై సమానంగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ అంచనాల్ని అడవిశేష్ అందుకున్నాడు. ఎవరు సినిమాతో మరోసారి ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు. గతేడాది ఇదే టైమ్ కు గూఢచారితో హిట్ కొట్టిన ఈ హీరో, ఈ ఏడాది ఎవరు సినిమాతో కమర్షియల్ గా గూఢచారి కంటే పెద్ద హిట్ అందుకున్నాడు. అటు శర్వానంద్ చేసిన రణరంగం మూవీ ఫ్లాప్ అవ్వడమే కాకుండా.. విమర్శలపాలైంది కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: