హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం హిట్ కావటంతో సంపూర్ణేష్ బాబుకు వరుసగా అవకాశాలొచ్చాయి. సినిమాల్లో బాగానే అవకాశాలొచ్చినప్పటికీ సంపూర్ణేష్ బాబుకు సరైన హిట్ రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైన సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమా గత నెలలో విడుదలై సూపర్ హిట్టైంది. నిర్మాతకు ఈ సినిమా భారీగా లాభాలను అందించింది. 
 
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ సంపూర్ణేష్ బాబును హీరోగా పెట్టి ఒక వినోదభరితమైన సినిమా తీయాలని అనుకుంటున్నాడని సమాచారం. డైరెక్టర్ క్రిష్ మొదటి సినిమా గమ్యంలో అల్లరి నరేశ్ పాత్రతో కామెడీని బాగా పండించాడు. గమ్యం తరువాత క్రిష్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేసాడు. వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో క్రిష్ వరుసగా విజయాలు పొందాడు. 
 
కానీ ఈ సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. క్రిష్ దర్శకత్వంకు మంచి పేరే వచ్చినప్పటికీ సినిమాలు అనుకున్నంత రేంజులో హిట్ కాలేదు. ఝాన్సీలక్ష్మీభాయి చరిత్రతో కంగనా రనౌత్ హీరోయిన్ గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మణికర్ణిక సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మహానాయకుడు సినిమా విడుదలైన తరువాత క్రిష్ కొత్త సినిమాకు కమిట్ అవలేదు. 
 
సంపూర్ణేష్ బాబుతో క్రిష్ సినిమాను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తారని తెలుస్తోంది.  ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే పూర్తి చేసినట్లు సమాచారం.క్రిష్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కూడా సంపూర్ణేష్ బాబుతో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపుతున్నారని సమాచారం. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: