బిగ్ బాస్ సీజన్ 3 అనుకున్నట్లుగా హైలెట్ కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఒకటి కాదు ఎన్నో కనిపిస్తాయి. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ డల్ అయిందన్నారు. అయితే బలమైన కంటెస్టెంట్లు  బిగ్ బాస్ 2 లో ఉన్నారు. హోస్ట్ పరంగా చూస్తే నాని వీక్ అనుకున్నారు, ఇపుడు బిగ్ బాస్ సీజన్ 3 సాగుతోంది. ఎంతో స్ట్రేచర్ ఉన్న నాగార్జునని పెట్టారు. అయినా ఎక్కడా హైప్ క్రియేట్ కావడంలేదు.


నాగార్జున మొక్కుబడిగానే బిగ్ బాస్ 3 ని లాగించేయ‌డం పెద్ద మైనస్ అంటున్నారు. ఆయన వారం రోజుల పాటు జరిగే  ఎపిసోడ్స్ ని చూడరని, తీరుబాటుగా వారంతంలో వచ్చి స్క్రిప్ట్ ప్రకారం మొక్కుబడిగా చేసుకుపోతున్నారని అంటున్నారు. ఇక నాగ్ కి ఇచ్చిన పారితోషికం చూసుకుంటే 12 కోట్లుట. ఆయన ఓ సినిమా చేస్తేనే ఇపుడున్న మార్కెట్లో నాలుగైదు కోట్లు కంటే రావు అంటే దానికి మూడు రెట్లు అన్నమాట.


నాని వరకే హోస్ట్ వీక్ అనుకుంటే నాగ్ మరింతగా మైనస్ అయ్యాడని అంటున్నారు. పైగా ఆయన బిగ్ బాస్ సీజన్ 3 జరుగుతుండగా మధ్యలో వెళ్ళిపోవడం పెద్ద అప్సెట్ గా భావిస్తున్నారు. దాంతో రమ్యక్రిష్ణ  లేటెస్ట్  రెండు రోజుల షోను నడిపించేశారు. రమ్యక్రిష్ణ అప్పటికపుడు వచ్చి షో చేసినా కూడా బాగానే నడిపించిందన్న టాక్ నడుస్తోంది.


అంటే నాగ్ కంటే రమ్యను పెట్టినా షోకి కిక్ వచ్చేదన్న వారూ లేకపోలేదు. ఇపుడు నాగ్ ఇచ్చిన ఈ ఐడియా వల్ల మరో అరవై రోజుల పాటు జరిగే షోలో నాగ్ ఒక వేళ ఏ కారణంగా మిస్ అయినా రమ్య ఉందన్న ధీమా బిగ్ బాస్ నిర్వాహకుల్లో కనిపిస్తోంది


. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో ఈసారి కంటెస్టెంట్లు కూడా వీక్ గా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. దాంతో పెద్ద టాస్కులు కూడా లేకపోవడం, సెలిబ్రిటీలు కూడా ఈ వైపు కన్నెత్తి చూడకపోవడంతో బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తోందంటే నడుస్తోంది అన్నట్లుగా ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: