ఒక మిడిల్ ఏజ్ వచ్చాక ఏ హీరోకైనా ఆయనకు తగ్గ హీరోయిన్ అంటే వయసుకు తగ్గ హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ. కొంతమందైతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అందుకే ఒక్కొక్కసారి స్టార్స్ పక్కన హీరోయిన్స్ ని వెతకలేక దర్శక నిర్మాతలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే మన బాలయ్య సరసన ఒక హీరోయిన్ మూడోసారి నటిస్తోంది. ఎప్పుడో పదేళ్ళ క్రొతం సంచలనం సృష్టించింది సోనాల్ చౌహాన్. 'జన్నత్' సినిమాలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి సరసన నటించి గుర్తింపును సంపాదించుకుంది. 


అయితే హిందీ జనాలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమెకు రెండో సినిమా తెలుగు నుంచి అవకాశం వచ్చింది. 'రెయిన్ బో' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆ తర్వాత తెలుగులో  కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొంత విరామం అనంతరం బాలకృష్ణ సినిమా 'లెజెండ్'లో అవకాశం సంపాదించుకుంది. అప్పటి నుంచి బాలకృష్ణ సినిమాలే సోనాల్ ని ఆదుకుంటున్నాయి పాపం. బాలకృష్ణకు తగిన హీరోయిన్లను తేవడం దర్శకులకు, నిర్మాతలకు బాగా కష్టం అయిపోతున్నట్టుగా ఉంది. అందుకే హీరోయిన్ల రిపీట్ చేయడం తప్పడం లేదు. 

అందులో భాగంగా మరోసారి ఛాన్స్ సోనాల్ చౌహాన్ కు దక్కినట్టుగా ఉంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో సోనాల్ చౌహాన్ తో ఆ హీరో స్టిల్స్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యాయి. దీని ద్వారానే మరోసారి  బాలయ్యతో సోనాల్ జతకడుతోందనే క్లారిటి వచ్చింది. డిక్టేటర్ లో కూడా సోనాల్ బాలయ్యతో నటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి బాలీవుడ్ లో పనికిరాని హీరోయిన్ టాలీవుడ్ లో మాత్రం బాలయ్య వంటి స్టార్ హీరో సరసన అవకాశాలను అందుకుంటుందంటే గొప్ప విషయమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: