కేజీఎఫ్ స్టార్ యశ్... తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఎదిగిన ఆయన... తమ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీలో వెలుగు వెలగాలని కోరుకుంటాను అని తెలిపారు. త్వరలో విడుదల కానున్న కిస్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో పరిచయం కాబోతున్న హీరోయిన్ శ్రీ లీల గురించి మాట్లాడిన యశ్... వాళ్లు తమకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.


అయితే కన్నడ పరిశ్రమలో వేరే ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ పరిచయం అవుతుంది అంటే.... వారం రోజులు ఆ విషయం గురించే పత్రికల్లో రాస్తున్నారని .. దాని వల్ల సినిమాకి ప్రత్యేకంగా ఎలాంటి లాభం లేదని అన్నారు. కానీ.. కన్నడకు చెందిన హీరోయిన్లు ఇంతర భాషల్లోనూ స్టార్ గా ఎదగాలని కోరుకుంటాను అన్నారు యశ్. ప్రస్తుతం అది జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శాండల్ వుడ్ ను అన్ని పరిశ్రమలు గౌరవించాలని కోరుకుంటా.


అయితే  ఇక్కడే ఎదిగి మరో ఇండస్ట్రీ కి వెళ్ళిన వారు.... మూలాలు మరిచిపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలు పరోక్షంగా రష్మిక మందనను ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోంది. బెంగుళూరు లో జరిగిన  డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో భాగంగా... తనకు కన్నడ భాష సరిగ్గా రాదు అని రష్మిక చెప్పడమే ఇందుకు కారణం. ఆరోజు యశ్ కూడా విజయ్ దేవరకొండ, రష్మిక లతో స్టేజ్ పైనే ఉన్నారు.


ఇంతకు ముందు రష్మిక తీరు పై చాలా మంది హీరోలు మండిపడ్డారు. హీరో జగ్గేశ్ సైతం రష్మిక విషయంలో విమర్శలు చేశారు. పాపులారిటీ వచ్చే శాక ... మూలాలను మరిచిపోరాదు అంటూ కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: