యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వసూళ్ల పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాంతో పాటు ఉత్త‌రాంధ్ర ఏరియాల్లో సాహో రికార్డుల ప‌రంగా స‌రికొత్త చ‌రిత్ర న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమాకు రాని  వ‌సూళ్లును కొల్ల‌గొడుతోంది. ఇంకా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబ‌లి రికార్డుల‌కు సైతం సాహో చెక్ పెట్టేసింది. 


ఈ రికార్డుల ప‌రంప‌ర‌లో నెల్లూరు సిటీలో ఎవ్వ‌రికి సొంతం కాని రికార్డు ప్ర‌భాస్ సొంతం అయ్యింది. ఇక్కడ అత్యంత వేగంగా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా సాహో ఘనత దక్కించుకుంది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ బాహుబలి 2 పేరు మీద ఉండేది. ఇక్క‌డ బాహుబలి 2 కోటి గ్రాస్ అందుకోవడానికి దాదాపు 5 రోజులు పట్టగా సాహో కేవలం 3 రోజుల్లో రూ.1.34 కోట్ల గ్రాస్ రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. 


నెగిటివ్ టాక్‌తో కేవ‌లం మూడు రోజుల‌కు ఒక్క నెల్లూరు సిటీలోనే 1.34 కోట్ల గ్రాస్ అంటే మామూలు విష‌యం కాదు. ఇక షేర్ విషయానికి వస్తే బాహుబలి 2 మొదటి వారంలో రూ.80 లక్షల షేర్ ఖాతాలో వెసుకోగా సాహో కేవలం 3 రోజుల్లో రూ.71.76 లక్షల షేర్ అందుకుని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 


తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ పుట్టాక ఒక్క సిటీలో ఈ రేంజ్‌లో వ‌సూళ్లు సాధించ‌డం... అది కూడా వ‌రుస‌గా ప్ర‌భాస్ నటించిన రెండు సినిమాలు ఇలా హిట్ కొట్ట‌డం.. కోటి రూపాయ‌లు వ‌సూళ్లు సాధించ‌డం అంటే చ‌రిత్ర‌గానే చెప్పాలి. ఈ వసూళ్లతో జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్ బేస్ గతం కంటే రెట్టింపైందిని స్పష్టంగా తెలుస్తోంది. బాహుబ‌లి 2 సినిమా రికార్డును సాహో తుప్పుమ‌ని ఊదేసిందంటే సాహోపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అది కూడా నెగిటివ్ టాక్‌తో ఈ రేంజ్ వ‌సూళ్లు అంటే ప్ర‌భాస్ మామూలోడు కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: