టాలీవుడ్ బుల్లితెరపై తనదైన మార్క్ చాటుకున్నాడు యాంకర్ ఓంకార్.  ఆ తర్వాత ‘జీనియస్’ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఓంకార్ టెక్నీకల్ వైజ్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. ఇక ఓంకార్ దర్శకత్వం వహించిన రెండో సినిమా రాజుగారి గది. ఎక్స్ పెక్టేషన్స్ ఏమి లేకుండా చిన్న మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది.  ఈ సినిమా హిట్ తర్వాత అక్కినేని నాగార్జున, సమంత ముఖ్యపాత్రల్లో రాజుగారి గది2 తీశారు కానీ అది నిరాశపరిచింది.   

తన సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు అందుకున్న క్యూట్ పిల్ల అవికాగోర్. ఇక ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మావ వంటి సినిమాలతో మంచిసక్సెస్ అందుకున్న అవికా గత కొంత కాలంగా సినిమాలు తగ్గిస్తూ వస్తోంది. ఇక  చాలా రోజుల దర్శనమిచ్చిన అవికా ఉహించని లుక్ లో దర్శనమిచ్చింది.

ఓక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓంకార్ స్వయంగా ఈ రాజుగారి గది- 3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం పోస్టర్ ను వినాయక చవితి సందర్బంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో అవికా భయంకరంగా కనిపిస్తూ.. అందరినీ భయబ్రాన్తులకు గురిచేస్తుంది.. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫియెర్సీ ఫస్ట్ లుక్ ని సెన్సషనల్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసారు.

మొదట ఈ సినిమా కోసం తమన్నాని అనుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె డ్రాప్ అవ్వడంతో అవికా గోర్ ని తీసుకున్నారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అవికా సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేసింది. వీలైనంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి అక్టోబర్ మొదటివారంలోనే రిలీజ్ చేయాలనీ ఓంకార్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: