ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ బంగారు బుల్లోడు గుర్తుంది కదా..ఈ మూవీ టైటిల్ గా అల్లరి నరేష్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అల్లరి నరేష్ గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవు తున్నాడు. సుడిగాడు సినిమా తరువాత ఇంత వరకు అల్లరోడికి బాక్స్ ఆఫీస్ హిట్ దక్కలేదు.

ఇటీవల మహర్షి సినిమాలో స్పెషల్ రోల్ చేసి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ మూవీకి ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా నరేష్ బంగారు బుల్లోడు సినిమా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. దీపావళి సందర్బంగా తన కామెడీ మూవీ విడుదల కానున్నట్లు స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాకు పివి గిరి దర్శకుడు.

పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.  సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ  వేసవి చివరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ ని పిలిపించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు టాక్. బంగారు బుల్లోడు సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకు కూడా సహా నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.

అల్లరి నరేష్, పూజా జవేరితో పాటు తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల ఈ మూవీలో నటిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాసిన ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలకు సాహిత్యం అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి. నరేష్ మహర్షి సినిమాతో మహేష్ కి క్లోజ్ అయ్యాడు కాబట్టి మహేష్ కి రెండు వైపులా ఇన్విటేషన్స్ అందనున్నాయి. మరి మహేష్ సినిమా కోసం ఎంతవరకు హెల్ప్ అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: