తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాతో సంగీత దర్శకుడుగా అడుగుపెట్టిన అనిరుద్ రవిచందర్, ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పాటలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కంపోజ్ చేయడం జరిగింది. అయితే తోలి సినిమానే ఘోర పరాజయాన్ని అదనుకోవడంతో, తెలుగులో అంత ఈజీగా అనిరుద్ కు అవకాశాలు రాలేదు. ఇక కొంత గ్యాప్ తరువాత ఇటీవల నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన జెర్సీ మూవీకి సంగీతం అందించాడు అనిరుద్. ఆ సినిమా సూపర్ హిట్  కొట్టడం, 

అలానే  సినిమాలో సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టడంతో, అనిరుద్ కు తెలుగులో తొలి విజయం లభించింది. ఇక దాని తరువాత మరొక్కసారి నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ కు ప్రస్తుతం సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు అనిరుద్. విక్రమ్ కె కుమార్ దర్శకుడిగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మంచి క్రేజీ ప్రాజక్టు గా రూపొందుతున్న ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే నేడు ఈ సినిమా నుండి మూడవ లిరికల్ సాంగ్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి, ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కు ఎక్కువగా యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. 

మరీ ముఖ్యంగా మొన్న రెండవ పాటగా రిలీజ్ అయిన 'హొయినా హొయినా' అనే సాంగ్ ఇప్పటికే చాలా చోట్ల వినిపిస్తుండగా, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నిన్ను చూసే ఆనందంలో' అనే లిరికల్ సాంగ్ కూడా మంచి క్యాచీగా ఫ్రెష్ మ్యూజిక్ తో యూత్ లో విపరీతంగా దూసుకెళుతోంది. ఇక రేపు రిలీజ్ తరువాత గ్యాంగ్ లీడర్ కనుక మంచి హిట్ సాధిస్తే, ఇకపై తమిళ్ తో పాటు తెలుగులో కూడా అనిరుద్ కు అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికె తమిళ్ లోని పలువు స్టార్ హీరోల సినిమాలకు అనిరుద్ అందించిన సంగీతం, అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి టాలీవుడ్ లో అతడి భవితవ్యం ఎలా వుంది అనేది రేపు గ్యాంగ్ లీడర్ రిలీజ్ తరువాత కానీ చెప్పలేం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: