బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఫస్ట్ టైం టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పటివరకు ఈ సినిమాలో నటించినందుకు హీరోయిన్ గా మైనస్ అనే మాట మాత్రం రానేలేదు. అందుకు కారణం శ్రద్ధా వెండితెర మీద తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఓవైపు సాహో ప్రచారం.. మరోవైపు ముంబై రోడ్లపై నిరసనలు..చేస్తోంది. సంవత్సరం అంతా క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండి...ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేదు కదా మరి ఏంటి ఈ నిరసనలు..? అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సాహో కోసం ఏడాది పాటు శ్రమించడమే కాదు.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నెలరోజులుగా నిద్రాహారాలుమాని మెట్రో నగరాల్లో పర్యటించింది. ఇంత బిజీగా ఉండీ కూడా  ఓ సోషల్ కాజ్ కోసం రోడ్లపై నిరసనలకు దిగుతుందా? అంటే అవును అందుకే అందరు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

ముంబై పశ్చిమ ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉన్న చోట యారీ ఏరియా అడవిలో 300 చెట్లు నరికేస్తున్నారట. అక్కడ మెట్రో లైన్ వేయడానికి ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. దీంతో అధికారులు చెట్లు నరికించేందుకు సన్నాహల్లో ఉన్నారు. అందుకే దీనిపై ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జనాలకు మద్ధతుగా నిలుస్తూ .. శ్రద్ధా కపూర్ సైతం యారీ ఏరియాలో నిరసనలు చేపట్టింది. ప్లకార్డులు పట్టుకుని వీధివీధినా తిరిగి తన మద్ధతును తెలిపింది.  శ్రద్ధాతో పాటుగా భారీగా పర్యావరణ ప్రేమికులు కూడా నిరసనలు చేపట్టారు. 

తాజాగా అక్కడ మెట్రో మార్గం వేసేందుకు అడవులు నరికేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శ్రద్ధా తీవ్రంగానే వ్యతిరేకిస్తోంది. అయితే నిరసనల్లో ఎక్కడా హింసాత్మకంగా ప్రవర్తించ లేదు. ఎంతో శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తోంది. అడవుల సంరక్షణ మన అందరి బాధ్యత..సేవ్ యారీ అంటూ రాసిన ప్లకార్డ్ ను ప్రదర్శిస్తోంది. ఇంత మంచి పని చేస్తున్నందుకు శ్రద్ధా పై  ప్రజలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానుల్లోనూ తన చర్యలకు అద్భుత స్పందన వస్తోంది. ఏదేమైనా ఒక స్టార్ హీరోయిన్ ఇలా సామాజిక అంశం మీద ఫైట్ చేస్తుంటే ప్రతీ ఒక్కరు సపోర్ట్ చేయక ఏం చేస్తారు చెప్పండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: