బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ క్రేజ్ రోజు రోజుకు అంతకంతకు పెరుగుతోంది. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ పాపులర్ హీరోయిన్ గా ఆలియా ఒక వెలుగు వెలిగిపోతోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ నాయికగా పాపులరైంది. దీంతో పాటు హిందీలో పలు భారీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక సల్మాన్ భాయ్ సరసన నటించే గ్రేట్ ఛాయిస్ తనకే దక్కినా భన్సాలీ- సల్మాన్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.

అదంతా అటుంచితే రాజీ కథానాయికగా ఆలియాకి యువతరంలో పెరిగిన క్రేజును దృష్టిలో ఉంచుకుని పలు కార్పోరెట్ బ్రాండ్లు ఆలియా వెంట పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ బ్రైడ్స్ కాస్ట్యూమ్స్ బ్రాండ్ వాణిజ్య ప్రకటనను తన ఖాతాలో వేసుకుంది ఆలియా. ఇన్నాళ్లు బ్రైడ్స్ కి అందాల కథానాయిక అనుష్క శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. ఇక అనుష్క స్థానంలో ఆలియాను బ్రైడ్స్ ఎంపిక చేసుకుంది. తాజాగా రిలీజ్ చేసిన కొన్ని సెకన్ల యాడ్ లో ఆలియా నవవధువు లెహెంగా దుస్తుల్లో తళతళా మెరిసిపోతూ అదరగొట్టేసింది.

పెళ్లికూతురు గెటప్ లో సిగ్గు పడుతూ హొయలు పోతున్న ఆలియాను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు! కళ్లతోనే కోటి భాషలు పలికిస్తూ కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. అయితే ఇంతగా సిగ్గు పడుతూ వధువు గెటప్ లో బ్రైడ్స్ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నందుకు ఆలియా ఖాతాలోకి భారీ మొత్తమే చేరబోతోందిట. ఒక్కో డీల్ కి కోట్లలో కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ కార్పోరెట్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది. దుల్హాన్ వాలి ఫీలింగ్.. సూపర్ ఎగ్జయిటెడ్.. మోహీ ఫ్యాషన్ లెహంగా ప్రచారం కొత్త ముఖంగా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది.. అంటూ ఆలియా ఉబ్బితబ్బిబ్బవుతోంది. మొత్తానికి అటు భారీ సినిమాలు ఇటు భారీ కార్పోరేట్ యాడ్స్ తో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది ఆలియా. 



మరింత సమాచారం తెలుసుకోండి: