సాహో వ‌సూళ్ల గురించి ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. బాలీవుడ్‌లో టాక్‌తో సంబంధం లేకుండా ఆ సినిమాకు వ‌స్తోన్న వ‌సూళ్లు బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌ను సైతం షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఏపీలో కంటే నైజాంలో సాహో టాక్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఏపీలో తొలి రోజు ఎలా ఉన్నా రెండో రోజు నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్లు లేవ‌ని అంటున్నారు. 


బాలీవుడ్‌లో మూడు రోజుల‌కు ఏకంగా రూ.80 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డంతో అక్క‌డ స్టార్ హీరోలు సైతం నోరెళ్ల బెడుతున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఈ వ‌సూళ్లు సూచిస్తున్నాయి. ద‌క్షిణాదిలో తెలంగాణ‌ను వ‌దిలేస్తే తమిళ‌నాడు, కేళ‌ర‌, క‌ర్నాక‌ట‌లో మాత్రం సాహోకు పంచ్ ప‌డ్డ‌ట్లే క‌నిపిస్తోంది. వీకెండ్‌కు తోడు వినాయ‌క చ‌వితి సెల‌వు క‌లిసొస్తుండ‌టంతో బ‌య్య‌ర్లు ఆశావ‌హ దృక్ప‌థంతోనే ఉన్నారు. 


ఇక ఏపీలో సాహో ప‌రిస్థితి ఎలా ఉన్నా ప్ర‌భాస్ భాగ‌స్వామిగా సాహో నిర్మాత‌లు వంశీ - ప్ర‌మోద్ సంయుక్తంగా నిర్మించిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట‌లో మాత్రం సాహో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మ‌ల్టీఫ్లెక్స్‌లో సౌత్ ఏషియాలోనే అతి పెద్ద స్క్రీన్ ఇక్క‌డ నిర్మిత‌మైంది. ఆ మెగా స్క్రీన్‌తో పాటు చిన్న సైజులో రెండు వేరే స్క్రీన్లు కూడా ఉన్నాయిక్క‌డ‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా వ‌చ్చి ఈ థియేట‌ర్‌ను ఓపెన్ చేయ‌డంతో ఈ థియేట‌ర్‌పై అంద‌రికి ఆస‌క్తి ఏర్ప‌డింది.


తొలి రోజు రూ.500 టిక్కెట్ పెట్ట‌గా అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక రెండో రోజు నుంచి రూ.200 టిక్కెట్ పెట్ట‌గా సోమ‌వారం వ‌ర‌కు అన్ని షోలు హౌస్ ఫుల్ అయిపోయాయ‌ట‌. తొలి రోజు వి ఎపిక్‌లో రూ.20 ల‌క్ష‌ల గ్రాస్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క‌లెక్ష‌న్ రూ.40 ల‌క్షల దాకా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మూడు రోజుల‌కు రూ.40 ల‌క్ష‌లు అంటే రికార్డే. ఈ థియేట‌ర్లో సినిమా చూసేందుకు నెల్లూరుతో పాటు చిత్తూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల నుంచి ప్రేక్ష‌కులు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: