పూరి జగన్నాథ్  మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం  పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే  టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా  సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్  యంగ్  హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య   'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి  ప్రియా పోస్ట్  కూడా చేసింది. అందుకే విజయ్ దేవరకొండ, పూరిని  అడిగి మరి  అమ్మడికి అవకాశం ఇప్పించాడట.  త్వరలోనే ఈ వార్తకు  సంబంధించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించనుంది.   


ఇక  ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి  మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరిసినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.  అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ సినిమా కూడా  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన  పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.  ఇప్పటికే పూరి ఈ సినిమాకి సంబధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: