రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నాళ్ల క్రితం, దర్శక ధీరుడైన రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల అత్యద్భుత విజయాలతో దేశ, విదేశాల్లో సూపర్ ఫాలోయింగ్ మరియు మార్కెట్ ని సంపాదించాడు. అయితే అంతటి భారీ విజయాల తరువాత ఆయన ఇటీవల నటించిన సాహో సినిమా, మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి, తొలిరోజు నుండి నెగటివ్ టాక్ తో రన్ అవుతోంది. అయితే ఈ రెండు రోజులు ఆదివారం సెలవు, మరియు సోమవారం వినాయక చవితి కావడంతో సాహోకు బెటర్ గానే కలెక్షన్స్ వచ్చాయని, ఇక రేపటినుండి ఈ సినిమాకు అసలు అగ్ని పరీక్ష మొదలవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే చాలావరకు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ బాగా డల్ అయినట్లు రిపోర్టులు వస్తున్నాయని, 

ఇక రేపటినుండి అవి మరింతగా తగ్గే అవకాశం కూడా లేకపోలేదని వారు అంటున్నారు. ఇక మరోవైపు ఈ సినిమాకు అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్ల కలెక్షన్ లభించినట్లు నిర్మాతలు ప్రకటిస్తుండడంతో, అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో అర్ధం కావడం లేదని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ తో, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ కొంత ఆలోచనలో పడ్డట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. రాజమౌళి సహా మిగతా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా సాహో పై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారని, అయితే ఒక్కసారిగా ఆ సినిమాకు షాకింగ్ రీతిన నెగటివ్ రాక్ రావడంతో వారు షాక్ అయ్యారని అంటున్నారు. అయితే దీన్నిబట్టి వారికి తెలిసింది ఏంటంటే, సినిమాలో ఖర్చు కంటే కంటెంట్ ముఖ్యం అని, 

కాబట్టి ప్రస్తుతం ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న తమ ఆర్ఆర్ఆర్ సినిమాను ఇకపై మరింత జాగ్రత్తగా షూట్ చేయాలని భావిస్తున్నారట. సినిమాకు కథ మరియు కథనాలే ప్రధమం కనుక, వాటిలో తమ సినిమా ఏ మాత్రం ఫెయిల్ కాకూడదని భావించి, దర్శకుడు రాజమౌళి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త అసలు నిజమా లేక కాదా అనే విషయాన్ని ప్రక్కన పెడితే, ఒక భారీ సినిమా ఫెయిల్యూర్ వలన కలిగిన నష్టాన్ని చూసి, రాబోయే మరిన్ని భారీ సినిమాలు దానిని ఒక గుణపాఠంగా తీసుకుని, తమ సినిమాలను మరిన్ని జాగ్రత్తలతో తెరకెక్కించడం ఎంతైనా శుభపరిణామం అని, దాని వలన అవి ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువని అంటున్నారు సినీ విశ్లేషకులు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: