ప్రతిసారీ ఒకే ఫార్ములాతో సినిమా తీసి హిట్టు ఇస్తామంటే చూసేవాళ్ళు ఉండాలి కదా. ఒక సినిమానే ట్రైలర్ ఆసక్తిగా అనిపిస్తేనే థియోటర్ కి వెళుతున్నారు. ఇక హర్రర్ సినిమాలైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ఇప్పటికే తెలుగులో డజన్ల కొద్దీ హారర్ సినిమాలొచ్చాయి. హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ ల కంటే డిఫరెంట్ సినిమాలెన్నో వస్తున్నాయి. ప్రతిసారీ కొత్త జోనర్లు పరిచయం అవుతున్నాయి. వీటన్నిటి మధ్య వరుస పెట్టి హారర్ సినిమాలొస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరో హారర్ సినిమా తీయడం కరెక్టేనా? అంటే..ఆ సినిమాని తీసే విధానంలో ఇంకేం కొత్తగా చూపించబోతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు రాఘవ లారెన్స్ లాగా. ముని సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమా ఇప్పటి వరకు కమర్షియల్ గా హిట్ అందుకుంటూనే ఉంది.

ఇక ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది ఫ్రాంఛైజీ గురించి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలి భాగం ఘనవిజయం సాధించినా రెండో భాగం నిరాశపరిచింది. నాగార్జున, సమంత ఉన్నప్పటికి ఓంకార్ ని ఆదుకోలేకపోయింది. అయినా ఈ సిరీస్ లో మూడో సినిమా తీసేందుకు ఓంకార్ ఎంతో పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజుగారి గది 3 సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో ఘనంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కాని అనూహ్యంగా మిల్కీ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఆ తర్వాత కాజల్ పేరు వినిపించినా అది కూడా సాధ్యపడలేదు. చివరకి నవతరం కథానాయిక అవికా గోర్ ఈ ప్రాజెక్టుకి కమిటైంది. ఈ సినిమాలో అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
 
తాజాగా రాజుగారి గది 3 ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో అవికా గోర్ లోని హారర్ యాంగిల్ ని రివీల్ చేశారు. ఇందులో ఏదైనా మిరాకిల్ అనిపించే కథను చూపించాల్సి ఉంటుంది. ఆ కథ కొత్తగా కూడా ఉండాలి. లేదంటే హారర్ సినిమాలకు టెస్టింగ్ టైమ్ స్టార్టయినట్టే. మరి ఇలాంటి టైం లో ఓంకార్ బృందం ఆ మిస్టేక్ చేస్తున్నరనే అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ.. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు ప్రధాన బలం కానున్నాయి. ఊర్వశి- అలీ- బ్రహ్మాజీ- ప్రభాస్ శ్రీను- హరితేజ- అజయ్ ఘోష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ ఫ్రాంఛైజీలో రాజుగారి గది 3 సక్సస్ అవుతుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: