బిగ్ బాస్  లో అందాల శిల్పం

 శిల్పా చక్రవర్తి  పెద్దగా పరిచయం అందరికీ  తెలిసిన పేరు. తన అద్భుతమైన  యాంకరింగ్ తో ఎన్నో టీవీ షోలను  రక్తి కట్టించిన యాంకర్ శిల్ప చక్రవర్తి.   ఎన్నో సినిమా మరియు టెలివిజన్ కార్యక్రమాలు ఈమె యాంకరింగ్లో  చాలా పాపులర్ అయిన విషయం మన తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. అద్భుతమైన వాగ్ధాటితో  స్పష్టమైన తెలుగు ఉచ్చారణ తో ఆమె యాంకరింగ్ చేసి ఎందరో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.  శిల్పా శెట్టి బుల్లితెర నటిగా కూడా ఆమె తనను తాను నిరూపించుకున్నారు. 

 ఇప్పుడు మన తెలుగు నాట ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తున్న అద్భుతమైన షో బిగ్ బాస్. ప్రతిరోజు  మన ఇంటి సంగతి మరిచిపోయి బిగ్ బాస్ ఇంటిలో ఏమవుతుందో తెలుసుకోవాలని ఆతృత ఈ కార్యక్రమం యొక్క వీక్షకుల  దినచర్యగా మారిపోయింది. ఈ బిగ్ బాస్ షో యొక్క మూడవ అ సీజన్లో రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా అడుగు పెట్టిన శిల్పా  చక్రవర్తి ఈ బిగ్ బాస్ షో వీక్షకుల మనసు గెలుచుకుంటుందని అనుకోవచ్చు. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెర మరియు సినిమా రంగం వైపు అడుగుపెట్టిన ఈ భామ ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన వ్యక్తి. 

 మొదటి వైల్డ్కార్డ్ ఎంట్రీ గా ఈ సీజన్లో ఇంటిలో అడుగుపెట్టిన తమన్నా సింహాద్రి మధ్యలోనే వెళ్లిపోయిన విషయం బిగ్ బాస్ కార్యక్రమ వీక్షకులందరికి తెలుసు.    ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసి ఇ మధ్యలోనే వెళ్ళిపోయిన తమన్నా సింహాద్రి తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ గ శిల్ప చక్రవర్తి బిగ్ బాస్ కార్యక్రమంలో అడుగు పెట్టింది.  అనర్గళంగా తెలుగు మాట్లాడగల సత్తా బెంగాలీ భామ శిల్ప చక్రవర్తి సొంతం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా శిల్ప చక్రవర్తి కి బిగ్బాస్ వీక్షకులు శుభాభినందనలు తెలియజేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: