బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం బిగ్ బాస్ షో నుండి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం జాఫర్ ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కాగా నాలుగవ వారం రోహిణి ఐదవ వారం అషు రెడ్డి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. 
 
నిన్నటి ఎపిసోడ్లో వినాయక చవితి పండుగ సందర్భంగా బిగ్ బాస్ పండ్లు, పూలు పంపిస్తాడు. పూలతో బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇంటిని అందంగా అలంకరిస్తారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతారు. మొదట బిగ్ బాస్ అలీ, రవికృష్ణను కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు. కన్ఫెషన్ రూమ్లో వీడియో ద్వారా శిల్పా చక్రవర్తి అలీ, రవికృష్ణను ఒకరిని నామినేట్ చేయమని చెబుతుంది. అలీ రాహుల్ ను, రవి కృష్ణ మహేశ్ విట్టాను నామినేట్ చేస్తాడు. 
 
తరువాత బిగ్ బాస్ వితికా షేరు, పునర్నవి భూపాళం ఇద్దరినీ పిలుస్తాడు. శిల్పా చక్రవర్తి నామినేట్ చేయమని చెప్పటంతో వితికా షేరు అలీ రేజాను పునర్నవి భూపాళం రవికృష్ణను నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్ శివజ్యోతి, హిమజను కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు. హిమజ రాహుల్ సిప్లిగంజ్ ను, శివ జ్యోతి మహేశ్ విట్టాను నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు. 
 
శిల్పా చక్రవర్తి రాహుల్, మహేశ్ విట్టాను నామినేట్ చేయమని చెప్పటంతో రాహుల్ శ్రీముఖిని, మహేశ్ విట్టా అలీని నామినేట్ చేస్తారు. బిగ్ బాస్ బాబా భాస్కర్, శ్రీముఖిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు. శిల్పా చక్రవర్తి గొంతు మార్చి శ్రీముఖి, బాబా భాస్కర్ తో మాట్లాడుతుంది. శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ ను, బాబా భాస్కర్ అలీ రేజాను నామినేట్ చేస్తాడు. వరుణ్ సందేశ్ రవికృష్ణను, అలీ రేజాను నామినేట్ చేస్తాడు. శిల్పా చక్రవరి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. శిల్పా చక్రవర్తిని బిగ్ బాస్ ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పటంతో అలీ రేజా, శ్రీముఖిని నామినేట్ చేస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ కు రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా, మహేశ్ విట్టా, రవి కృష్ణ, శ్రీముఖి నామినేట్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: