‘సాహో’ మ్యనియాతో మరో రెండు వారాలు ఈ మూవీ తప్ప మరే సినిమా చూడరు అని ప్రచారం జరిగినా ఆ ప్రచారాన్ని పట్టించు కోకుండా నాని తన ‘గ్యాంగ్ లీడర్’ ను సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి ‘సాహో’ రిజల్ట్ రాకుండానే నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయం నాని ‘గ్యాంగ్ లీడర్’ కు అదృష్టంగా మారిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

గత కొంత కాలంగా టాప్ హీరోల సినిమాలు అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. నాగార్జున ‘మన్మధుడు 2’ ప్రభాస్ ‘సాహో’ టాప్ హీరోల సినిమాలు  అన్నీ ఇలా వరస ఫ్లాప్ లుగా మారుతున్న పరిస్థితులలో ఇప్పుడు ప్రేక్షకులు ఒకసరైన ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోగలిగితే కనీసం రెండు వారాలు ఈ సినిమా కలక్షన్స్ విషయంలో దుమ్ము దులిపే ఆస్కారం ఉంది. ‘సాహో’ లో ఏమాత్రం కామిడీ లేకపోవడంతోపాటు యాక్షన్ సీన్స్ పట్ల విసుగు పెంచుకున్న తెలుగు ప్రేక్షకులకు ఒక వెరైటీ కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ ఊహించని ఘనవిజయం సాధిస్తుందా అన్న అంచనాలు ఉన్నాయి. 

అప్పటికి ‘సాహో’ మ్యానియాను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోవడంతో పాటు ‘గ్యాంగ్ లీడర్’ కు సోలో రిలీజ్ డేట్ దక్కడంతో నాని కోరుకున్నన్ని ధియేటర్స్ దొరుకుతాయి. దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ మూవీకి చాల డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు నిన్న వినాయకచవితి నుండే నాని ఈ సినిమా కోసం అప్పుడే చానల్స్ లో ఇంటర్వ్యూలు కూడ మొదలుపెట్టేసాడు. దీనితో ప్రభాస్ కు దక్కుతుంది అనుకున్న హిట్ తన రూట్ మార్చి నానీని వదిలి పెట్టదా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: