ఎన్టీఆర్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ప్రతి సినిమా దేనికి అదే ప్రత్యేకత.  అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సినిమా ఆది.  అది కేశవరెడ్డిగా ఎన్టీఆర్ నటన అమోఘం.  రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా.  అప్పట్లో ఈ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా సినిమాలు వచ్చాయి.  వరసగా కథలు మార్చి సినిమాలు చేసేవారు.  ఈ వరసలో వచ్చి ఆది సినిమా సూపర్ హిట్.  


ఎన్టీఆర్ అప్పటికి చాలా చిన్నవాడు.  అది ఎన్టీఆర్ కు మూడో సినిమా అనుకుంటా.  అంత చిన్న వయసులో భారీ సబ్జెట్ ను డీల్ చేయగలడా అనుకున్నారు.  వినాయక్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చింది.  అలానే డైలాగులను పరుచూరి బ్రదర్స్ రాశారు.  డైలాగ్స్ రాసిన తరువాత ఆ డైలాగ్స్ ను ఎన్టీఆర్ చెప్పగలడా అనుకున్నారట.  కానీ, ఎన్టీఆర్ అద్భుతంగా చెప్పాడు.  సినిమాకు డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.  


అంతేకాదు, మొదటిసారి రాయలసీమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, అక్కడి పంపులో నీళ్లు తాగే సమయంలో ఎన్టీఆర్ కళ్ళలో తీసిన ఆ షాట్ సూపర్ అని అంటున్నారు.  ఇక క్లైమాక్స్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు.  వైజాగ్ లో షూట్ చేసే సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది.  దీంతో సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ చేద్దామని అనుకున్నారట.  కానీ, ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు.  తన చేతికి దెబ్బతగిలితే షూటింగ్ పోస్ట్ ఫోన్ ఎలా చేస్తారు అని మొండికేశారట.  


చేయి నొప్పిగా ఉన్నాసరే దాన్ని భరిస్తూనే సినిమా క్లైమాక్స్ పూర్తిచేశారని, గతంలో పెద్ద ఎన్టీఆర్ బొబ్బులి పులి సమయంలో ఇలానే చేశారని... ఎంతటి కష్టం వచ్చినా సినిమా షూటింగ్ కు విఘాతం కలిగించడం జరగదని అది ఆ రక్తంలోనే ఉందని పరుచూరి బ్రదర్స్ ఓ సందర్భంగా పేర్కొన్నారు.  ఎన్టీఆర్ నిబద్ధతకు ఇదొక నిదర్శనంగా అయన చెప్పారు.  అలా సిన్సియర్ గా ఉంటాడు కాబట్టే ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  బల్గెరియాలో షూటింగ్ జరుగుతున్నది.   ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: