సాహో మూవీ ఇపుడు దేశంలోనే ఓ చర్చగా ఉంది. ఈ సినిమా హిట్టా..ఫట్టా అంటూ చర్చలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. సినిమాలో ఏమీ లేదు, ఇది వేస్ట్ మూవీ అని మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగిటివ్ రివ్యూస్ వచ్చి పడ్డాయి. దాదాపుగా 350 కోట్లతో తీసిన సినిమా ఇది. దాంతో ఈ మూవీ విషయంలో ఇలా రావడంతో సాహో పని అయిపోయిందనే అనుకున్నారు. కానీ ఇక్కడ సాహో విషయంలో చూడాల్సింది వేరే ఉందా.


రివ్యూస్ తో సంబంధం లేకుండా సాహో కలెక్షన్లు  ఉండడమే ఆలొచించాల్సిన విషయం. ముఖ్యంగా బాలీవుడో సాహో తన కలెక్షన్లు తొలి నాలుగు రోజులూ పెంచుకుంటూ పోయింది. బయట టాక్ తో సంబంధం  లేకుండా కలెక్షన్లు రావడంతో బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సైతం సాహో అంటున్నారుట. ముఖ్యంగా బాలీవుడ్లో ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు.


తెలుగులో సాహోకి నెగిటివ్ దెబ్బ కొంత పడినా హిందీలో మాత్రం ప్రభాస్ అదరహో అంటున్న తీరుని తరుణ్ ఆదర్శ్ తన రివ్యూలు మార్చి మరీ రాయాల్సివచ్చింది. ఇక సాహో మూవీ విషయంలో మరోటి కూడా జరిగింది. బాహుబ‌లి తరువాత ప్రభాస్ మూవీ కావడంతో హిందీలో ఆయన మార్కెట్ ఏంటన్నది ఇపుడు వెల్లడైదని కూడా అంటున్నారు


డైరెక్ట్ గా ప్రభాస్ హిందీలో మూవీస్ చేస్తె అది ఇంతకు పదింతలు అయ్యేది కూడా అంటున్నారు. అయితే సాహో తెలుగు నుంచి హింది వైపు ప్రభాస్ వెళ్లాడు, ఇపుడు బాలీవుడ్లో వస్తున్న ఆదరణ చూసి ప్రభాస్ హిందీ మూవీకి సైన్ చేస్తాడేమో చూడాలి.


ఇదిలా ఉండగ సాహోకి అతి తక్కువ రేటింగ్ ఇచ్చిన తరుణ్ ఆదర్శ్ ఇపుడు అదరగొడుతోందని రాయడం నిజంగా షాకింగ్ పరిణామమే. ఐతే సెలవులు అయిపోయినందున సాహో ఇదే వూపు కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఓ బిగ్ మూవీ, హాలీవుడ్ రేంజ్ చేజింగ్స్ అన్న ప్రచారం ఓవైపు, నెగిటివ్ ప్రచారం మరో వైపు మధ్యన సాహో ఏ తీరం చేరుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: