టాప్ డైరెక్టర్ రాజమౌళి ఎవరి ఒత్తిడిలకు లొంగడు. తన కథకు సంబంధించి హీరోల ఒత్తిడికి అనుగుణంగా కథలో మార్పులు కూడ చేయడు. తాను అనుకున్న కథను అనుకున్న విధంగా ఎటువంటి రాజీ పడకుండా తీస్తాడు కాబట్టి రాజమౌళికి ఇప్పటి వరకు పరాజయాలు పలకరించలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. 

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న రాజమౌళి పై ఈ మూవీ హీరోలు జూనియర్ చరణ్ లు ఒక విషయమై విపరీతమైన ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న వినాయకచవితి పండుగరోజున ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ అయినా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులకు చవితి శుభాకాంక్షలు చెపితే బాగుంటుంది అంటూ చరణ్ జూనియర్ లు ఎంతో బలవంత పెట్టినట్లు టాక్. 

అయితే చివరి నిముషం వరకు తన మనసులోని మాటను బయటపెట్టకుండా రాజమౌళి ఊహించని విధంగా చరణ్ జూనియర్ ల కోరిక పై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నిన్న చవితి పండుగ రోజున ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ నుండి ఒక ఆసక్తికర ట్విట్ వచ్చింది. ‘తారక్ తో బల్గేరియాలో రాజమౌళి షూట్ చేస్తున్నారు. చరణ్ చేత కొన్ని యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు’ అంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ఈ మూవీకి సంబంధించిన ఒక అప్ టు డేట్ ను విడుదల చేసింది. 

దీనితో చరణ్ జూనియర్ లు ఈ సినిమాకు సంబంధించి కోరుకున్నది ఒకటి అయితే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి బయటపెట్టింది మరొకటి. దీనితో జక్కన్న తాను అనుకున్నది చేస్తాడు తప్పించి ఎంతటి టాప్ హీరోలు ఒత్తిడి పెట్టినా లొంగడు అన్న విషయం మరొకసారి అందరికీ తెలిసి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: