మన పర భాషల తేడా లేకుండా తన వ్యాప్తిని పెంచుకుంటూ వస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు కథల కొరత వచ్చి పడ్డది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలన్ని ఏ హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టో తీయాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణానగర్ లో కథలు పట్టుకు తిరిగే వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కాని స్టార్ సినిమా కథ నచ్చినా అది వర్క్ అవుట్ అవుతుందో లేదో అన్న డౌట్లతో రిస్క్ చేయడం ఎందుకని వెనుకడుగు వేస్తున్నారు. 


అలాకాకుండా ఆల్రెడీ సక్సెస్ అయిన హాలీవుడ్ సినిమా నుండి లైన్ ఎత్తేస్తే ఏ ప్రాబ్లెం ఉండదని మనవాళ్ల ఆలోచన. కనీసం కాపీ రైట్స్ తీసుకుని అయినా ఈ సినిమాలు చేస్తున్నారా అంటే ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరి రాదా అన్నట్టుగా ఆసాంతం కాపీ కొట్టేస్తున్నారు. అంతకుముందు వచ్చిన అజ్ఞాతవాసి, రీసెంట్ గా వచ్చిన సాహో సినిమాలు రెండు కథలు లార్గో వించ్ కు దగ్గరగా ఉన్నాయి.   


స్వయంగా ఆ దర్శకుడే ఇండియన్ సినిమాల మీద సెటైర్ వేసేలా ఈ సినిమాలు చేశాయి. ఏం మనదగ్గర కథల్లేవా అంటే ఉన్నాయ్ కాని వాటికి సపోర్ట్ ఇచ్చే దర్శక నిర్మాతలు లేరు. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు కొత్త కథలతో రిస్క్ చేసే పరిస్థితుల్లో లేరు అందుకే అరిగిపోయిన పాత టేప్ రికార్డర్ లానే రొటీన్ రివెంజ్ స్టోరీల మీద పడుతున్నారు. 


మేకింగ్ ఎంత స్టైలిష్ గా ఉన్నా ఏం లాభం సినిమా కథలో దమ్ము లేకపోతే.. వార్ని మనోడి 30 కోట్ల సినిమా కథను తెచ్చి 300 కోట్లు పెట్టి తీశాడుగా అనేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు పరిశ్రమలో కథల కొరత ఉన్నట్టు కనిపిస్తున్నా కృష్ణానగర్ లో కథలు పట్టుకు తిరిగే రచయితలకు, దర్శకులకు ఛాన్స్ ఇస్తే బెటర్. ఇప్పటికే తెలుగు పరిశ్రమలో చిన్న సినిమాల్లో పెద్ద మార్పు వచ్చింది. కంటెంట్ ఫుల్ సినిమాలతో ఈమధ్య చిన్న బడ్జెట్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. మరి స్టార్లు కూడా అలానే కొత్త కథలకు అవకాశం ఇస్తే మంచిదని భావిస్తున్నారు సిని విశ్లేషకులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: