కామెడీ తో, కూల్ కథల సినిమాలలో నటించిన హీరో వెంకీ.. టాలీవుడ్ బడా హీరోలలో ఒక ఈయన.. దగ్గుపాటి కుటుంబంలో పుట్టున వెంకీ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాడు. అయన మ్యానరిజంతో ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానాన్ని చూరకొన్నాడు. విషయానికొస్తే సినిమాలలో ఎప్పుడు కామెడీని పండించి కడుపుబ్బా నవ్వించిన వెంకీ, అంతకు మించిన రొమాన్స్ చేస్తారని అర్థమవుతుంది. అయన రొమాన్స్ తో హీరోయిన్స్ కు పిచేక్కిచ్చిన సినిమాలు  ఏంటో ఇప్పుడు చూద్దాము.. 

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఈ సినిమాలో వెంకీ ఇద్దరు పెళ్ళాల ముద్దుల ప్రియుడుగా రొమాన్స్ తో చంపేశాడు. సౌందర్య, వినీత తో తో కలిసి రొమాన్స్ చేశారు. ఆ సినిమాలో కథ కన్నా ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగే మొగుడిలా మంచి నటనను కనబరిచారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 

నువ్వు నాకు నచ్చావ్ .. విక్టరి వెంకీ, ఆర్తి అగర్వాల్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మొదట ఇద్దరికి పడకపోయినా కూడా ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడంతో, వానలో వెంకీ ఆర్తితో రొమాన్స్ రచ్చ లేపాడు. 

మల్లీశ్వరి.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, నటించిన ఈ సినిమాలో వెంకీ కి ముప్పై ఏళ్ళు వచ్చిన కూడా పెళ్ళికి నోచుకోడు దానితో పాపం వెంకీ అందరిచేత పెళ్లికాని ప్రసాద్ అని ఆమాటలు పడుతుంటారు. అనుకోకుండా హీరోయిన్ పరిచయం, అలా పాటలలో రొమాన్స్ కుమ్మేసాడని అందరు అన్నారు. 

ఘర్షణ.. ఈ సినిమాలో వెంకీ రొమాన్స్ కాస్త శృతి మించింది. ఆసిన్, వెంకీ కొంబోలో వచ్చిన సినిమాల వెంకీ లైఫ్ నే మార్చేసింది. ఆ సినిమా పెళ్ళయాక వచ్చే అందగాడా.. అందగాడా.. సాంగ్ లో పచ్చి రొమాన్స్ తో సాంగ్ కు రక్తి కలిగించాడు.. 

తులసి .. నయనతారతో కలిసి నీ కళ్ళతోటి.. నా కళ్ళలోకి అంటూ సాగిన ఓ పాటలో ముద్దు మురిపాలు చేస్తూ వీడియో కెమెరాకి చిక్కాడు. ఆ సినిమా ఇప్పటికి ఆ పాట వినపడుతూనే ఉంది. 
 
ఎఫ్ 2.. ఈ సినిమాలో లేట్ మ్యారేజ్ అంటూ తమన్నా వెంటపడి మరి మల్లె పూలు తీసుకొచ్చి మరి సరసాలు ఆడాడు. ఆ పాటలు కూడా బాగా పాపులారిటీని సంపాదిచున్నాయి. 

ఇలా చూసుకుంటే చింతలకాయల రవి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేషా లాంటి చిత్రాల్లో వెంకీ రొమాన్స్ ను ఆ హీరోయిన్లు తట్టుకున్నారని అంటున్నారు సినీ ప్రముఖులు. మరి వెంకీ మామ చిత్రంలో వెంకీ కి జోడి హాట్ బ్యూటీ పాయల్.. ఈమె వెంకీ నే చేస్తుందేమో అని అంటున్నారు మరి చూడాలి ఆ సినిమా ఎలా ఉండబోతుందోనని.. 



మరింత సమాచారం తెలుసుకోండి: