డిసెంబర్ 12 వస్తుంది అంటే తమిళనాడులో పెద్ద పండుగ వచ్చినట్టే.  ఎందుకంత స్పెషల్ అనే డౌట్ రావొచ్చు.  అక్కడికే వస్తున్నా.. డిసెంబర్ 12 న సౌత్ స్టార్ హీరో రజినీకాంత్ పుట్టినరోజు.  ఆరోజున తమిళనాడు మొత్తం పండుగ చేసుకుంటుంది.  చాలా కాలం నుంచి రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి.  వివిధ నేతలతో అయన మంతనాలు జరుపుతున్నారు.  రజినీకాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ తో మంతనాలు జరుపుతున్నారు. 


ప్రస్తుతం  రజినీకాంత్ మురుగదాస్ తో దర్బార్ సినిమా చేస్తున్నారు.  దాదాపు 25 సంవత్సరాల తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  నవంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్ లో సినిమా ఆడియో వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.  


అయితే, ఆడియో వేడుకను ఎప్పుడు నిర్వహించబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  డిసెంబర్ 12 న ఆడియో వేడుకను నిర్వహిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.   అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 12 వ తేదీన రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.  దర్బార్ రజినీకాంత్ కెరీర్లో ఆఖరి సినిమా అవుతుందని కొందరి అభిప్రాయం.  


కానీ, దర్బార్ సినిమా సమయంలో రజినీకాంత్ దర్శకుడు శివతో చర్చలు జరిపారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రజినీకాంత్ శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని సమాచారం.  ఇందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇక రజినీకాంత్ కు సంబంధించిన ఓ లుక్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  సెట్ లో మురుగదాస్ తో కలిసి మాట్లాడుతున్న ఫోటో అది.  ఈ ఫోటోపై రజిని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  రజిని వయసు 20 సంవత్సరాలు తగ్గిపోయిందని.. చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారని అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: