ఐదారేళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్న జబర్దస్త్ షోతో చాలామంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జబర్దస్త్ షో రాకముందు వచ్చిన తర్వాత వారి ఫైనాన్షియల్ గ్రాఫ్ కూడా అలా పెరిగిపోయింది. ఆడియెన్స్ ను నవ్వించడం అంత తేలికైన విషయం ఏమి కాదు అయినా సరే వందల కొద్ది ఎపిసోడ్స్ తో కడుపుబ్బా నవ్వించేలా చేయడమే వారి పని.      


అయితే జబర్దస్త్ లో ఒక్కొక్కరిది ఒక్కో బ్యాక్ డ్రాప్ ఉంది. కొందరు దాని వల్ల క్రేజ్ తెచ్చుకోగా ఆల్రెడీ ఓ రంగంలో సెటిల్ అయిన వారు ఇక్కడకు వచ్చి ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటివారిలో అదిరే అభి కూడా ఉన్నాడు. 2016 వరకు అధిరే అభి సాఫ్ట్ వేర్ జాబ్ చేశాడు. జబర్దస్త్ లో చేస్తూనే సాఫ్ట్ వేర్ జాబ్ కొనసాగించాడు.   


ఇండస్ట్రీలో అవకాశాల కోసం కూడా జాబ్ చేసుకుంటూనే ట్రైల్స్ వేస్తూ ఉన్నాడు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ స్నేహితుడిగా మొదటి సినిమా చేశాడు అదిరే అభి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. కొన్ని బుల్లితెర షోలకు డైరక్షన్ చేశాడు. ఇలా అన్నిటిని చేసుకుంటూ వస్తున్నాడు అదిరే అభి. 2016 లో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి ఇక పూర్తిగా ఇండస్ట్రీలో ఉండిపోయాడు. బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశానని చెప్పారు అదిరే అభి. 


అదిరే అభి టీం నుండి వచ్చిన ఆది ఇప్పుడు జబర్దస్త్ ను అలరిస్తున్నాడు. తనకెవరు ఛాన్స్ ఇవ్వలేదు.. అందుకే టాలెంట్ ఉన్న వాళ్లకు తాను ఛాన్స్ ఇస్తానని చెప్పుకొచ్చారు అదిరే అభి. భీమవరంలో ఈవెంట్ పని మీద వెళ్లిన అదిరే అభి తనకు అక్కడ ప్రేక్షకులు చూపించిన ప్రేమ అభిమానం చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పిన అదిరే అభి జబర్దస్త్ లో మాత్రం తప్పకుండా కొనసాగుతా అని అన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: