ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  ఇందులో కొమరం భీం పాత్రను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి.  అల్లూరి సీతారామ రాజు పాత్ర గురించి ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.  కొమరం భీం కు సంబంధించిన సినిమాలు ఇప్పటివరకు రాలేదు.  ఈ పాత్ర టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కావడంతో ఈ పాత్రను బలంగా చెప్పడానికి రాజమౌళి కంకణం కట్టుకున్నారు.  


బల్గెరియాలో షూటింగ్ జరుగుతున్నది. కొమరం భీం పాత్రకు సంబంధించి, జూనియర్ ఆర్టిస్టులతో కలిసి తీయాల్సిన సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం.  మరో నెలరోజులపాటు అక్కడే షూటింగ్ జరుగుతుంది. ఆగస్ట్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా లుక్ ను రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు.  ఎందుకంటే ఇందులోని రెండు పాత్రలు దేశం కోసం పోరాటం చేస్తూ, దేశం కోసం దేహం త్యాగం చేసిన వ్యక్తులే.  


కానీ, ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.  ఎలాంటి లుక్ ను రిలీజ్ చేయలేదు.  కనీసం ఆ సినిమాకు సంబంధించిన సమాచారం కూడా బయటకు రాలేదు.  అక్టోబర్ లో దసరా కానుకగా సినిమాకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం అందుతున్నది.  అయితే క్లారిటీ లేదు.  దసరాకు కొమరం భీం కు సంబంధించిన పాత్రను మాత్రమే రిలీజ్ చేస్తారా లేదంటే.. ఇద్దరితో కలిపి లుక్ రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.  


అయితే, ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ కు చెందిన అజయ్ దేవగణ్, అలియా భట్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు.  తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది.  మాములుగా ఎన్టీఆర్ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటాడు.  మిగతా భాషల్లో ఎన్టీఆర్ కు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తారు.  కానీ, ఆర్ఆర్ఆర్ విషయంలో అలా కాకుండా, నాలుగు భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోబోతున్నారని వినికిడి.  ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉన్నది.  ఒకవేళ అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పుకుంటే.. అది వరల్డ్ రికార్డ్ అవుతుంది.  అందులో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: