మహేంద్ర సింగ్ ధోని... ఇండియన్ సినీ క్రికెట్లో తిరుగులేని ఆటగాడినే కాకుండా, సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం క్రితమే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పకున్న ధోని ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. త్వరలో ఆయన అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు.


తాజాగా ధోనీ గురించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత ఆయన సినిమా రంగం వైపు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ధోనీ నటన వైపు వస్తారని మాత్రం అనుకోవద్దు. సినీ నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


గతంలో నీరజ్ పాండే దర్శకత్వంలో ధోనీ బయోపిక్ వచ్చింది. ఆ సమయంలో పాండేతో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన ధోనీ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, నిర్మాణ రంగంలో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకున్నారట. అయితే క్రికెట్లో కొనసాగుతూ అది సాధ్యం కాదు కాదు కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఇటు వైపు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారట.


క్రికెట్లో అడుగు పెట్టిన తర్వాత ధోనీకి మంచి పాపులారిటీ రావడంతో వాణిజ్య ప్రకటనల్లో నటించడం, బ్రాండ్ ఎడార్స్మెంట్ల ద్వారా వంద కోట్ల రూపాయలు సంపాదించారు. అయితే ఆయన సొంతగా ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెడతారా? లేదా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పెట్టుబడిదారుడిగా ఉండబోతున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధోనీ అంతకు మునుపు ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. క్రికెట్ లో కెరియర్ ఎక్కువ కాలం ఎలాగూ ఉండదు కాబట్టి, ఇలా తన ఫ్యూచర్ ప్లాన్ వేసుకున్నాడు అన్నమాట. ధోని చెల్సే ప్రతీ పని లో విజయం సాధించే సుడి ఉన్న వ్యక్తి అని అతని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి అలాగె విజయం సాధించాలి అని కోరుకుందాము.


మరింత సమాచారం తెలుసుకోండి: