మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మాస్ మూవీ వాల్మీకి. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా, అయనంక బోస్ ఫొటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు జర్ర జర్ర అనే పల్లవితో సాగె వీడియో సాంగ్ ప్రోమోకు వీక్షకుల నుండి మంచి మార్కులు పడుతున్నాయి. అలానే కొద్దిరోజుల క్రితం హీరోయిన్ పూజ హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు, 

ఆ పోస్టర్ కు కూడా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమాలో ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని, దర్శకుడు హరీష్ శంకర్, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. మా వాల్మీకి సినిమాలో దర్శకుడు సుకుమార్ గారి నుండి ఒక సడన్ సర్ప్రైజ్ ఉంది, మేము కోరగానే ఒప్పుకున్నందుకు దర్శకుడు సుకుమార్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ హరీష్ తన పోస్ట్ లో తెల్పుతూ సుకుమార్ తో కలిసి దిగిన ఫోటోలను పెట్టారు. అయితే అసలు సుకుమార్ ఈ సినిమాలో ఎందుకు ఉన్నారు, 

ఆయన సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ లో నటించారు, అసలు నటించారా లేక మరేదైనా విషయమై సినిమాకు సాయపడ్డారా అనే చర్చ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది. మరి ఈ అనుమానాలన్నింటికీ సమాధానం దొరకాలంటే, ఈనెల 20న వాల్మీకి అయ్యే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేసి, ప్రి రిలీజ్ వేడుకను మరొక వారం రోజుల్లో జరుపనున్నట్లు సమాచారం అందుతోంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: