బాహుబలి ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోహీరోయిన్లుగా భారీబడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ హిందీలో రూ.100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. గ‌త నెల 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు భాష‌ల్లో రిలీజ్ అయి నీ సినిమా తొలి మూడు రోజుల్లోనే అన్ని లాంగ్వేజెస్‌లో క‌లుపుకుని రూ.300 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. సినిమాపై డివైడ్‌ టాక్‌ వచ్చినా, సినీ విశ్లేషకులు నెగెటివ్‌గా రివ్యూలిచ్చినా బాక్సాఫీస్‌ వసూళ్లు గట్టి సమాధానం చెప్పాయి.


బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్‌గా మార‌డంతోనే ఈ వ‌సూళ్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మూడు రోజులుగా బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం క్రియేట్ చేసిన ఈ సినిమా నాలుగో రోజు నుంచి కాస్త స్లో అయిన‌ట్టు తెలుస్తోంది. సోమవారం వినాయక చవితి ఉండటంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హిందీ వెర్ష‌న్‌లో సోమ‌వారం వ‌సూళ్లు ఏకంగా 50 శాతం డ్రాప్ అయ్యాయి. 


సోమ‌వారం సాహో హిందీ వెర్ష‌న్ కేవ‌లం రూ.14 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టింది. గత నాలుగు రోజులుగా బాలీవుడ్‌లో పలు రికార్డులను మట్టి కరిపిస్తూ రూ.93 కోట్లు వసూళ్లు సాధించిన సాహో సెంచరీకి చేరువలో ఉంది. సెలువులు పూర్త‌వ్వ‌డంతో మంగ‌ళ‌వారం నుంచి సాహోకు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదురు కానుంది. మ‌రి స‌గ‌టు ప్రేక్ష‌కుడు సాహోను ఇప్పుడు థియేట‌ర్ల‌కు వ‌చ్చి చూస్తాడా ?  లేదా ? అన్న దానిని బ‌ట్టి సాహో బాక్సాఫీస్ రిజల్ట్ ఆధార‌ప‌డి ఉంది.


సోమ‌వారం డ్రాఫ్ చూస్తుంటే సాహోకు క‌ష్టాలు మొద‌లైన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంత డ్రాఫ్‌తో మంగ‌ళ‌వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏం చేస్తుందో ?  భారీ టార్గెట్ ఎలా చేధిస్తుందో ?  చూడాలి. ఇక సినిమా స్క్రీన్‌ప్లే సాగదీసినట్టుగా ఉందంటూ పలువురు సినిమాపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్‌ సాహో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుండటంతో భారీ అంచనాలతో హైప్‌ క్రియేట్‌ అయినా ఫ‌లితం నిరుత్సాహ ప‌రిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: