అనన్య ప్రజంట్స్ పతాకం పై భూపాల్ ,అరుణ్ , ప్రియాంక ,సంజన హీరో హీరోయిన్స్  గా D రామకృష్ణ దర్శకత్వం లో రోపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాచిలర్ పార్టీ.  వినాయకచవితి సందర్భంగా  ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్  లాంచ్ చేసారు . 


 ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ...  ఇది ఒక యాక్షన్ వెరైటీ .ఈ చిత్రం లో అన్ని కమర్షిల్ హంగులు ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ సుబ్బారావు శ్రీనివాస్ గార్లు చక్కటి సహకారం అందించారు. మా ఆర్టిస్టులు భూపాల్, అరుణ్, రమణారెడ్డి చక్కగా యాక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు .


హీరో అరుణ్ కురిటి  మాట్లాడుతూ ఇది నా మొదటి చిత్రం డైరెక్టర్ గారి సహకారంతో చాల చక్కగా నటించాను . అలాగే భూపాల్ , రమణారెడ్డి  నా కో ఆర్టిస్టులు గా చక్కని సహకారం అందించారు ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి పేరు తెస్తుంది అని ఆశిస్తున్నాను  అని అన్నారు .


ఇంకా ఈ కార్యక్రమం లో జబర్డస్ట్ నవీన్ , రైటర్ మాణిక్యలరావు కారేపల్లి  తదితరులు పాల్గొన్నారు . అరుణ్ కురిటి , భూపాల్ , ప్రియాంక , సంజన , గిరి , జబర్డస్ట్ మహేష్ , జబర్డస్ట్ నవీన్ ,చిత్రం శీను ,రమణ రెడ్డి ,  వెంకటేష్ గౌడ్ , శిరీష  తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : ప్రమోద్ కుమార్ , DOP : ఆనంద్ మురళి రచన సహకారం : కారేపల్లి మాణిక్యాలరావు , రాజేష్ సవరపు  ప్రొడ్యూసర్స్ : సుబ్బారావు డి, శ్రీనివాస్ సంపంగి  , రచన దర్శకత్వం : డి రామకృష్ణ



మరింత సమాచారం తెలుసుకోండి: