సాహో..ప్రభాస్ హీరోగా సుజిత్ రెడ్డి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా. కేవలం ఒక్క సినిమా అనుభవంతో దర్శకుడు సుజిత్ ఈ సినిమా గొప్పగానే తీశాడు. ప్రభాస్ కూడా అన్నీ తానై ప్రాజెక్ట్ కోసం చాలానే కష్టపడ్డాడు. అయినా రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఇంత భారీ బడ్జెట్ సినిమాని ప్రేక్షకుల  ముందుకు తీసుకురావడానికి ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ అలా జరగలేదనిపిస్తుంది. బోలెడన్ని లోటు పాటులున్నట్లు కనిపిస్తోంది. అందుకే సాహో జరిగిన పొరపాట్లు సైరా కి జరగకుండా సైరా టీం జాగ్రత్తలు తీసుకుంటోందట.

హీరో ఎంత పెద్ద స్టార్ అయినా భారీ బడ్జెట్ సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డే నే నెగెటివ్ టాక్ రాకూడదు. ఏమాత్రం చిన్న బ్యాడ్ టాక్ వచ్చినా అది సినిమాపై దారుణంగా ప్రభావం చూపిస్తుంది. అందుకు సాహో నే పెద్ద ఉదాహరణ. సాహో కు ఇలానే మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. వీకెండ్ ప్లస్ హాలిడే సీజన్ కావడంతో ప్రస్తుతానికి వసూళ్లు బాగున్నప్పటికీ మంగళవారం నుంచి ఈ సినిమా అసలు విషయం తెలుస్తుంది. నెగెటివ్ టాక్ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మరోవైపు సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ సైరా యూనిట్ బాగా గమనిస్తూ సైరా కి ఇలాంటివి రిపీట్ అవకుండా ప్లాన్ చేసుకుంటున్నారని తాజా సమాచారం.

సాహో తర్వాత వస్తున్న మరోభారీ సినిమా సైరా. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది చిత్ర బృందం. ఇందులో ముఖ్యంగా రన్ టైమ్ పై దృష్టిపెట్టింది. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను తెరపై చూపాలి, అందులోనూ గతంలో ఎక్కడా ఎవరూ చూపని పాత్ర అది.. అందుకే చాలా రీసెర్చ్ చేసి మరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీని బైటకు తీశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీన్స్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. అమితాబ్ వంటి స్టార్ అట్రాక్షన్ కూడా ఉంది. అందుకే పోరాట సన్నివేశాలతో రన్ టైమ్ ఇంకా పెరిగి 3 గంటల రన్ టైమ్ వచ్చింది. 

3 గంటల రన్ టైమ్ తో సినిమాను విడుదల చేయాలా లేక ట్రిమ్ చేసి ఓ 15 నిమిషాలు కట్ చేయాలా అనే ఆలోచనలో ఉందని సమాచారం. త్వరలోనే రన్ టైమ్ పై చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటారు. కంటెంట్ విషయంలో కూడా సాహో లా కాకుండా 3 రోజులు ముందే కంటెంట్ ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అంటే దాదాపు విడుదలకు 8-9 రోజుల ముందే సెన్సార్ పూర్తిచేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. సినిమా హిట్ అయితే ప్రతి పాయింట్ ప్లస్ అవుతుంది. అదే రిజల్ట్ తేడా కొట్టినప్పుడు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడాల్సి వస్తుంది. సాహో విషయంలో ఇదే జరుగుతోంది. అందుకే సైరా విషయంలో ఇలాంటివి జరగకుండా మెగా కాంపౌండ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏదేమైనా తమ సినిమా కంటే నెల రోజుల ముందు సాహో లాంటి పెద్ద సినిమా రావడం సైరా యూనిట్ కు చాలా అడ్వాంటేజ్ అయింది. సాహో నుంచి సైరా యూనిట్ చాలా విషయాల్లో జాగ్రత్త పడుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: