టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ‘హృదయకాలేయం’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు సంపూర్ణేష్ బాబు.  ఈ సినిమాకు ముందు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తనకంటూ  ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇక ‘హృదయకాలేయం’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత మొదట కాస్త విమర్శలు వినిపించినా ఈ టైప్ కామెడీ ఎప్పుడూ చూడని ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఆదరించారు.  ఆ తర్వాత సింగం 123 సినిమాలో హీరోగా నటించారు. 

ఇలా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రల్లోనటించారు.  అయితే మూడు సంవత్సరాల క్రితం కొబ్బరి మట్ట సినిమా అనౌన్స్ మెంట్ చేశారు.  పోస్టర్లు, చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు..కానీ ఆ మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.  అలా ఎన్నో అవరోధాలు దాటుకుంటూ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అనుకున్నదానికన్నా ఎక్కువ ఈ మూవీ సక్సెస్ కావడమే కాదు..లాభాల పంట పండించింది.  ఆ సమయంలో నాగ్ నటించిన మన్మథుడు 2 రిలీజ్ అయినా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ‘కొబ్బరిమట్ట’ మడతపెట్టి కొట్టింది.

దీంతో సంపూ సినిమా బాగానే వర్కవుట్ అవుతుందని భావించిన సినీ నిర్మాతలు కొందరు అతడితో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే చాలు కటౌట్ తో పనిలేదని మారోసారి సంపూర్ణేష్ నిరూపించుకున్నాడు.  ఈ నేపథ్యంలో క్రిష్ లాంటి దిగ్గజం సంపూతో సినిమా తీయడానికిముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  కాకపోతే దర్శకుడిగా కాదు..నిర్మాతగా సంపూతో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు నిర్మాత సి.కళ్యాణ్ కూడా సంపూతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సంపూర్నేష్ బాబు క్రేజ్ మామూలుగా పెరగదు.


మరింత సమాచారం తెలుసుకోండి: