ఈ మద్య సోషల్ మీడియాలో ఇదుగో తోక అంటే అదుగో పులి అనే సామెతకు అద్దంపట్టేలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. లేనిపోని రూమర్లు వైరల్ గా మారి ఎంతో మంది ముఖ్యంగా సినీ సెలబ్రెటీలకు తలనొప్పిగా మారింది.  ముఖ్యంగా ఫేక్ ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మాద్యమాలతో సెలబ్రెటీలకు మింగుడు పడని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తాజాగా తనదైన వెరైటీ కామెడీతో విలనీజం చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఫిష్ వెంకట్  పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వారి పేర్లుతో ఎక్కౌంట్స్ ఓపెన్ చేసి కొందరు తమ ఇష్టం వచ్చిన రాతలు రాసి, వారికి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యే ఫిష్ వెంకట్ కు ఎదురైంది.  అసలు విషయానికి వస్తే.. గత కొద్ది రోజులుగా ఫిష్ వెంకట్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఎక్కౌంట్ నుంచి వైయస్ జగన్ పై దుష్ప్రచారం జరుగుతోంది. 

అది ఫేక్ ఎక్కౌంట్ అని తెలియని చాలా మంది ఫిష్ వెంకట్ ని టార్గెట్ చేసుకొని తిట్టుడు కార్యక్రమం పెట్టుకున్నారు ఫ్యాన్స్.  దాంతో ఈ తలనొప్పి పడలేక  ఆయన సైబర్ క్రైమ్ పోలీస్ లను ఆశ్రయించారు. అలాంటి ఎక్కౌంట్ ఓపెన్ చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఆన పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేయటానికి వెళ్లే సరికే ఆ ట్విట్టర్ ఎక్కౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు ఎలర్ట్ అయ్యారు...వెంటనే డిలీట్ కూడా చేశారు.

నేను, నా కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద ఫ్యాన్స్ అని..అలాగే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవాలని మనసారా కోరుకున్నవారిలో మేం ఉన్నామని..అలాంటిది సీఎం జగన్ ని మేం ఎందుకు తిడతామని వివరణ ఇచ్చారు ఫిష్ వెంకట్. దాంతో ఆయన్ను తిట్టిన వాళ్లు సారి చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: