రెండు, మూడేళ్ల క్రితం టాలీవుడ్ సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో అదిరిపోయే మార్కెట్ ఉండేది. ఏదైనా సినిమాకు పాస్‌లు ఇచ్చినా, ఫ్రీ టిక్కెట్లు ఉండ‌డంతో జ‌నాలు అక్క‌డ ఎగ‌బ‌డి మ‌రీ థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారు. అంతెందుకు మ‌హేష్ న‌టించిన అట్ట‌ర్ ప్లాప్ సినిమాలు బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ సినిమాలు కూడా ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ మార్క్ క్రాస్ చేశాయి. అదే హిట్ మ‌హ‌ర్షి సినిమా అక్క‌డ లాస్ వెంచ‌ర్ అయ్యింది. 


తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్ కొంగు బంగారంగా మారింద‌న్న టాక్ వ‌చ్చింది. బాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా అక్క‌డ మ‌న ఓవ‌ర్సీస్ మార్కెట్ ఉండేది. కొద్ది నెల‌లుగా  యుఎస్‌ మార్కెట్‌లో క్షీణత కనిపిస్తూనే వచ్చింది. బాగున్న సినిమాలకి, రేటింగులు వచ్చిన చిత్రాలకీ కూడా గతంతో పోలిస్తే వీక్‌ వసూళ్లు వచ్చాయి. యుఎస్‌ మార్కెట్‌ ఎంతగా పడిపోయిందనేది ఇప్పుడు సాహో వసూళ్లు చూస్తే తెలుస్తోంది. 


ఇంత భారీ బ‌డ్జెట్‌తో... భారీ హైప్‌తో వ‌చ్చిన సాహోకు ప్రీమియ‌ర్ల‌తో మిలియ‌న్ డాల‌ర్లు రాలేదు. హిందీ వెర్ష‌న్ ఉండ‌డంతో ఆ మాత్రం వ‌సూళ్లు అయినా వ‌స్తున్నాయి. సాహోతో సినిమా క్లియర్‌ అయిపోవడంతో ఇకపై పెద్ద సినిమాలకి భారీ అమౌంట్లు ఆఫర్‌ చేయడానికి అక్కడి బయ్యర్లు సిద్ధ పడడం లేదు. అక్క‌డ రిలీజ్ అయ్యే హీరో ముందు సినిమాకు అక్క‌డ వ‌చ్చిన అమౌంట్‌ను బ‌ట్టే ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్లు రేట్ ఫిక్స్ చేయ‌నున్నారు.


ఇక‌పై అక్క‌డ తెలుగు సినిమాల‌కు 2 మిలియ‌న్ డాల‌ర్లు వేస్తేనే బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు. ఓ మోస్త‌రు సినిమాలకి మిలియన్‌ లేదా 1.2 మిలియన్‌గా చూడవచ్చు. చిన్న సినిమాలకి అయితే రెండు కోట్లకి మించి రేటు పలికే అవకాశమే లేదు. ఒక‌ప్పుడు నాని, వ‌రుణ్‌తేజ్ లాంటి సినిమాల‌కు సైతం అక్క‌డ భారీ రేట్లు ఉండేవి. ఇప్పుడు అవ‌న్నీ ఖ‌ల్లాస్ అయ్యాయి. ఏదేమైనా ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుడు హీరోను బ‌ట్టి సినిమాలు చూడ‌డం మానేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: