సాహో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం. మొదటి రోజే డివైడ్ టాక్ .. ప్రభాస్ గత చిత్రం 'బాహుబలి' సిరీస్ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఆ ఎఫెక్ట్ ప్రభాస్ తర్వాతి చిత్రాలపై పడుతుంది. సరిగ్గా సాహో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంలో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు . అలాగే  ప్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు అదరగొడుతున్నాయి. యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా నటించిన సాహో.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్‌కు అక్కడి మాస్ జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్  ఖాన్స్ హిట్టు కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుంటే..మన వాళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. 

ఇంతకు ముందెన్నడూ ఏ స్టార్ అందుకోని ఫీట్ మన రెబల్ స్టార్ సాధించాడు. విడుదలైన నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్ల గ్రాస్​ వసూలు చేసిన ఈ చిత్రం.. మరో అరుదైన ఘనత సాధించింది. వైరల్డ్‌వైడ్‌గా వీకెండ్‌లో అత్యధిక మొత్తం సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఈ జాబితా టాప్​లో హాలీవుడ్​ చిత్రం హాబ్స్ అండ్ షా ఉంది. తర్వాతి స్థానాల్లో ద లయన్ కింగ్, వన్స్ అపాన్​ ఏ టైమ్​ ఇన్ హాలీవుడ్, ఏంజల్ హ్యాస్ ఫాలెన్ ఉన్నాయి.

బాలీవుడ్​లో కూడా  రూ.100 కోట్లకు చేరువలో ఉంది. అంటే అక్కడ సినిమా మంచి హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని సాహో కి 1\2 రివ్యూ ఇచ్చిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్రస్తుతం రూ.93.28 కోట్ల వసూళ్లతో సెంచరీ వైపు పరుగులు పెడుతోందీ చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్​గా శ్రద్ధా కపూర్ నటించింది. జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: