రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహ ..ప్రస్తుతం ప్రపంచ సినీ ఇండస్ట్రీ మొత్తం సాహో అంటుంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడం.. అలాగే భారీ బడ్జెట్ తో ...విజువల్ వండర్ గా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కడం తో సినిమాపై మొదటినుండి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సినిమా నుండి  విడుదలైన టీజర్స్ , ట్రైలర్స్ అన్ని కూడా అభిమానులని ఆకట్టుకోవడం తో సినిమా కోసం ప్రభాస్ తో పాటుగా సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు .

ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరదించుతూ.. సాహో ఆగస్ట్ 30న రిలీజ్ అయ్యింది. అందరూ ముందు నుండి ఉహించినట్టే సినిమా టాలీవుడ్ సినిమాలా కాకుండా ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉండటం తో భారీ విజయం అందుకుంది. మొదటి రోజు కొంత నెగటివ్ టాక్ వచ్చినప్పటికి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా బిగెస్ట్ ప్లాప్ అంటూ హోరెత్తించిన బాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తూ... బాలీవుడ్ మీడియాకి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. ఖాన్స్ త్రయం కూడా సాధించలేనటువంటి కలెక్షన్స్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దుమ్మురేపుతోంది. 

ప్రభాస్ గత చిత్రం బాహుబలి సిరీస్ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఆ ఎఫెక్ట్ ప్రభాస్ తర్వాతి చిత్రాలపై పడుతుంది. సరిగ్గా  సాహో కి మొదటిరోజు  మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంలో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఫ్యాన్స్‌లో ప్రభాస్ తదుపరి చిత్రంపై ఓవర్ ఎక్స్‌పెటేషన్స్ ఉంటాయి. వాటిని అందుకోవడం లో కొంచెం తడబడింది. ఇదే కానీ దర్శకధీరుడు రాజమౌళి అనుభవం అపారమైనది.. ఆయన ఐడియా స్ట్రాటజీ.. టేకింగ్ అద్భుతంగా ఉంటుంది.

చిన్న సినిమా తీసినా.. పెద్ద సినిమా తీసినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తాడు. అంతేకాకుండా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న అద్భుత కథనం కూడా బాహుబలి అనూహ్య విజయానికి దోహదపడింది.  ఇక జక్కన్న మాదిరిగానే సుజీత్ 'సాహో'ను తెరకెక్కిస్తాడన్న ఆశలు ఉన్నా కూడా వాటిని సరిగ్గా అమలుచేయడంలో కొంచెం విఫలం అయ్యాడు. సినిమానైతే హాలీవుడ్ రేంజ్ లో తీసాడు కానీ , హాలీవుడ్ రేంజ్ లో ప్రమోషన్ చేయలేకపోయాడు. కానీ బాహుబలి రేంజ్ విజయం కాకపోయినా సాహో కూడా భారీ విజయం సాధించినప్పటికీ ..ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బాహుబలి ని మించిన భారీ హిట్ కొట్టాలని ఊహించుకోవడం తోనే సాహో కి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: