బాలీవుడ్ క బాద్షా అమితాబ్.. పరిచయం అక్కర్లేని పేరు.. వయసు తో సంబంధం లేకుండా ఎటువంటి పాత్రలోనైనా ఇమిడి పొయ్యి చేయడం అయన ప్రత్యేకత.. 76 ఏళ్ల వయసులో కూడా అయన జనాలకు దగ్గర అవ్వాలంటే సినిమాలు చేయాలనీ అంటున్నారు.వయసు శరీరానికే కానీ, మనసుకు కాదు అంటూ బిగ్ బి వ్యాఖ్యానించారు. ఎప్పటి నుండో సినిమాలలో నటిస్తూ అందరి మనసులో మంచి నటుడు అని చెరగని ముద్ర వేసుకున్నారు.. 

అలా క్రేజ్ ఎక్కడ పోకుండా కాపాడుకొంటూ వస్తున్నారు. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇక కుర్ర హీరోలు సైతం ఆయనకు దాసోహం అంటున్నారు అంతగా ఫెమస్ అయ్యారు బిగ్ బి.. భాష ముఖ్యం కాదు. కథ ముఖ్యం అంటున్నారు బిగ్ బి .. పలు భాగాల్లో చాలా చిత్రాల్లో బిగ్ బి నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం బిగ్ బి తెలుగులో చారిత్రాత్మక చిత్రం సైరా లో నటించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ముస్తాబవుతుంది. 

మరో చిత్రంలో కూడా బిగ్ బి నటిస్తున్నారు.. అది తమిళ్లో తెరకెక్కుతుంది. తమిళ్లో ఆయనది మొదటి చిత్రం. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బిగ్ బి కి సంబందించిన ఒక వార్త నెట్టింట్లో షికారు చేస్తుంది. అదేంటంటే.. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు అయిన సిక్కింలో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ వాటర్ ఫాల్స్ పేరు ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్స్. గతంలో ఈ జలపాతానికి భీవ్మా అని పేరు. 
బిగ్ బి 'ఆంఖే' సినిమాలో కొన్ని సన్నివేశాల్ని భీవ్మా వాటర్‌ఫాల్స్‌ వద్ద యాభైరోజుల పాటు షూట్‌ చేశారు. అప్పటి నుండి దానికి అయన పేరు పెట్టి పిలుస్తున్నారు. అక్కడకొచ్చే ఎవరైనా కూడా అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్స్ అని పిలుస్తున్నారు. ఆ విషయం బిగ్ బి కి తెలియక పోవడం గమనార్హం. ఓ అభిమాని ట్వీట్‌తో తన పేరు మీద ఉన్న ఒక జలపాతం గురించి తెలుసుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ షాక్ అయ్యాడట. ఆ అభిమాని ఆ వాటర్ ఫాల్స్ ముందు ఫోటో దిగి బిగ్ బి ఫోటోను జత చేసి పోస్ట్ చేసాడు. దానికి బిగ్ బి రిప్లే ఇచ్చాడు. అది నిజమేనని. ఇకపోతే సింగపూర్‌లోని ఓ ఆర్కిడ్‌జాతి మొక్కకూ బిగ్‌బీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా బిగ్ బి కి రోజుకో షాక్ లు తగులుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: