టాలీవుడ్ దర్శకధీరుడిగా పేరుగాంచిన ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. 1920ల కాలం నాటి స్వాతంత్రోద్యమ కధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక పోస్టర్ కూడా వెలువడక పోవడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇటీవల సినిమాలో ఆమెకు సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో తన పాత్ర విషయమై ఆలియా ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూ లో హింట్ ఇచ్చినట్లు నేడు అక్కడి మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ ముందు వరుసలో ఉంటారని, అలానే వారితో సినిమాలు చేయాలనేది తన కల అని పేర్కొంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రాజమౌళి గారి దర్శకత్వంలో నటిస్తుండడంతో, ఒక కల నెరవేరబోతోందని ఎంతో ఆనందం వ్యక్తం చేసిందట. అయితే అదే సమయంలో అందులో మీ పాత్ర ఏంటి, సినిమాలో ఎంత లెంగ్త్  ఉంటుంది అనే విషయాలు మీడియా వారు అడగ్గా, నిజానికి నేను చిన్నదా, పెద్దదా అనేటువంటి విషయాలు పెద్దగా పట్టించుకోనని తెలిపింది. ఇక ఆమె చెప్పిన సమాధానాన్ని ఆసరాగా చేసుకొని ఆర్ఆర్ఆర్ లో ఆలియా క్యారెక్టర్ చాలా చిన్నది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. 

అంతేకాక మరికొందరు అయితే, ఆమెకు రాజమౌళి ఫేవరెట్ దర్శకుడు కావడంతో, తన పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆలియా ఒప్పుకుందని, అదే మరొక దర్శకుడి సినిమా అయితే చేసేది కాదు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇక అదే మీడియా సమావేశంలో ఆలియా మాట్లాడుతూ, తను తెలుగు నేర్చుకోవడానికి పడిన కష్టాలు అంతా ఇంతా కాదని, అయినప్పటికీ తన పాత్రకు న్యాయం చేయాలంటే తెలుగు ఖచ్చితంగా తెలిసి ఉండాలని, అందుకే తెలుగు కొంతవరకు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లు నిజంగా ఆర్ఆర్ఆర్ లో ఆలియా పాత్ర చిన్నదేనా లేక కాదా అనేది తేలియాలంటే మాత్రం వచ్చే ఏడాది జులై 30న ఆ సినిమా రిలీజ్ డేట్ వరకు వేచి చూడాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: