తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో కష్టపడి క్రిందనుండి పైకొచ్చిన హీరో రవితేజ. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ స్వయంకృషితో ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యాడు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇడియట్ సినిమా తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ సందర్భంలో వరుస విజయాలు అందుకుని అప్పట్లో స్టార్ హీరోల గా ఉండే వారికి దీటుగా కలెక్షన్లు సాధించిన రవితేజ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యాడు. కెరియర్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్న రవితేజకి ప్రస్తుతం ఇండస్ట్రీలో గడ్డుకాలం నడుస్తోంది.


ఇటీవల చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రవితేజ తర్వాత చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవడంతో రవితేజ పరిస్థితి ఇండస్ట్రీలో దయనీయంగా మారింది. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20వ తారీఖున విడుదల కాబోతుంది. అయితే కెరీర్ పరంగా గడ్డుకాలం గడుస్తున్న క్రమంలో రవితేజ ఒప్పుకున్న ప్రాజెక్టులు ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. రవితేజ ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


తాజాగా మరో దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. స్వామిరారా చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న సుధీర్ వర్మ ఇటీవల ఓ మాస్ కథని రవితేజకు వినిపించాడట.కథ నచ్చడంతో సుధీర్ వర్మతో సినిమా చేసేందుకు రవితేజ అంగీకరించినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన రణరంగం చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది..ఇటువంటి నేపథ్యంలో సరైన గుర్తింపు విజయాలు లేని డైరెక్టర్లతో రవితేజ సినిమాలు ఒప్పుకోవడం వార్తలు విని సోషల్ మీడియాలో రవితేజ అభిమానులు తెగ బాధపడి పోతున్నట్లు సమాచారం. కెరియర్ పరంగా చాలా డార్క్ పీరియడ్ నడుస్తున్న తరుణంలో రవితేజ ప్రయోగాలకి పోవడంపై నిరాశ చెందుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: