గత కొన్ని దశాబ్దాలలో దాదాపు ప్రతి భారతీయ మహిళ  లతా మంగేష్కర్ లాగా పాడాలని ఆరాటపడింది. అయితే అందరూ లతా మంగేష్కర్ కాలేరు కదా! ఇటీవలే రాణు మొండల్ అని ఒక  లతాజీ పాడిన 'ఏక్ ప్యార్ కా నాగ్మా హైతో' చాలా కీర్తి ప్రతిష్టలు పొందింది.


హిమేష్ రేషమియా లేడీతో ఒక పాటను కూడా రికార్డ్ చేశారు, దీని వల్ల ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.  సల్మాన్ ఖాన్ రాను మొండల్‌ కు 50 లక్షల ఇంటిని బహుమతి గా ఇచ్చాడని అంతేకాక  ఆమెకు దబాంగ్ 3 లో పాడటానికి అవకాశం ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ సల్మాన్ తాను ఎటూవంటి బహుమతిని ఇవ్వలేదని ఆ వర్తలన్ని పుకార్లని చెప్పాడు.

రాను మొండల్ అనుభవం గురించి  లతాజీ  "ఎవరైనా నా పేరు, పని నుండి లబ్ది పొందగలిగితే నేను అదృష్టవంతురాలిని , కానీ అనుకరణ వచ్చిన పేరు ఎంతో‌ కాలం పాటూ నిలవదు. నా పాటలు లేదా కిషోర్ కుమార్, లేదా మొహమద్ రఫీ పాటలు,  ముఖేష్ గారివి  లేదా ఆశా భోస్లే వంటి వారి పాటలు పాడటం ద్వారా, ఔత్సాహిక గాయకులు స్వల్పకాలిక దృష్టిని పొందవచ్చు. కానీ ఇది చిరకాలం‌ నిలవదు" అని లతాజీ తెలిపారు.

"టీవీ లో మ్యూజిక్ షోలలోని చాలా మంది చూపిస్తున్న ప్రతిభ నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. చాలా మంది పిల్లలు నా పాటలను చాలా అందంగా పాడతారు. కానీ విజయం సాధించిన తర్వాత వాటిలో వారికి ఎన్ని గుర్తుకు వస్తాయి? నాకు సునిధి చౌహాన్ మరియు శ్రేయా ఘోషల్ గురించి మాత్రమే తెలుసు. ” అని లతాజి అన్నారు.

“మా దశకం లో ఉన్న గొప్ప వారి పాటలు పాడండి  కానీ ఒక తరుణం  తరువాత గాయకుడు లేదా గాయకురాలు  తన సొంత  పాటను పాడాలి దాని వల్ల పేరు పొండాలి. ” అని  ఔత్సాహిక గాయకులకు లతాజీ సలహా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: